మూడు దెబ్బకు మాయమైన అను

0

న్యాచురల్ స్టార్ నాని మజ్నుతో టాలీవుడ్ కు పరిచయమై తక్కువ గ్యాప్ లోనే విశాల్ లాంటి స్టార్ల సరసన నటించే ఛాన్స్ పట్టేసిన అను ఇమ్మానియేల్ ఈ మధ్య పూర్తిగా కనిపించడం మానేసింది. గత ఏడాది క్రేజీ ప్రాజెక్ట్స్ చేసినా ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్లు కావడంతో కెరీర్ రిస్క్ లో పడ్డట్టుంది. నిజానికి అనుకి లాస్ట్ ఇయర్ వచ్చినవి చాలా సూపర్ ఆఫర్స్. పవన్ కళ్యాణ్ తో నటించే అదృష్టం ఎప్పుడు దక్కుతుందా అని సీనియర్ హీరోయిన్లే ఎదురు చూసే టైంలో అనుకి అజ్ఞాతవాసి వచ్చింది. కానీ అది అతి పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో ఆశలు తీరలేదు.

అయినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య ఛాన్స్ కొట్టేసింది. హీరో మారాడు కానీ ఫలితం రిపీట్ అయ్యింది. దెబ్బకు బన్నీ ఏడాది పైగా గ్యాప్ తీసుకున్నాడంటే ఆ సినిమా ఫలితం ప్రభావం గురించి వేరే చెప్పాలా. ఇక నాగ చైతన్యకు ష్యుర్ షాట్ హిట్ గా అందరూ అంచనా వేసిన శైలజారెడ్డి అల్లుడు కూడా బోల్తా కొట్టేసింది. ఇలా ముగ్గురు స్టార్లతో చేసినా అనుకు లాభం లేకుండా పోవడం కేవలం బ్యాడ్ లక్కే అని చెప్పాలి. ఒక్క సీన్ చేసిన గీత గోవిందం ఇండస్ట్రీ హిట్ అయినా చెప్పుకోలేని పరిస్థితి.

ఇప్పుడు చేతిలో సినిమాలు ఉన్నట్టు కనిపించడం లేదు. తమిళ్ లో శివ కార్తికేయన్ సరసన ఓ మూవీ చేస్తోందన్న టాక్ వచ్చింది కానీ దాని తాలూకు అప్ డేట్స్ కూడా రావడం లేదు. తక్కువ టైంలోనే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన హీరోయిన్ల లిస్ట్ లోకి అను వెళ్లేలా కనిపిస్తోంది. బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఎవరైనా స్టార్ హీరో ఇంకో ఛాన్స్ ఇస్తే అది హిట్ అయితే తప్ప ప్రేక్షకులు తనను పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది




Please Read Disclaimer