టాటూపై పాపాయమ్మల మోజు

0

కొత్తదనానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. నేటి తరం ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ విషయంలో పడి చస్తోందంటే అతిశయోక్తి కాదు. ఏదైనా హీరో కొత్త తరహా హెయిర్ స్టయిల్ లో కనిపించినా.. ఫ్యాషనబుల్ డ్రెస్ లో మెరిసిపోయినా వెంటనే ఫ్యాన్స్ వాటినే అనుసరిస్తారు. ఆ తరహా స్టయిల్ ని ఇమ్మిటేట్ చేస్తూ మురిసిపోతుంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే ఈ ట్రెండ్ అసాధారణంగా ఉంటుంది.

ముఖ్యంగా కథానాయికల ఫ్యాషన్స్ స్టైల్ కంటెంట్ పై నిరంతరం చర్చ సాగుతుంటుంది. ప్రస్తుతం యువతను ఊపేస్తున్న సరి కొత్త ఫ్యాషన్ ట్రెండ్ టాటూ. దీని కోసం యువత పిచ్చెక్కిపోతున్నారు. శరీరంలో తమకు ఇష్టమైన ప్రదేశంలో టాటూలు వేయించుకుని మురిసి పోవడం ఒక ట్రెండ్ గా కొనసాగుతోంది. ఇది ఒక్క సినీ ఇండస్ట్రీకే కాకుండా క్రికెట్ స్టార్లకు ఉన్న హ్యాబిట్. నయా పాశ్చాత్య కల్చర్ నుంచి వచ్చిన టాటూలపై మోజు అంతా ఇంతా కాదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్… శిఖర్ ధావన్ .. ఇంగ్లండ్ ఆటగాడు పీటర్సన్ ఇలా అనేక మంది క్రికెట్ ఆటగాళ్లు తమ దేహంతో టాటూలు వేయించుకుని బిల్డప్ ఇచ్చేస్తుంటారు.

సినీ ఇండస్ట్రీలోనూ ఈ టాటూలపై మోజు చాలా ఎక్కువే. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తన నడుపు పై భాగంలో టాటూ వేయించుకుని తనలోని రెచ్చగొట్టే అందాన్ని రెట్టింపు చేసింది. బుల్లితెర యాంకర్ అనసూయ ఎక్కువగా ఫొటో షూట్లతో రెచ్చిపోతుంటుంది. తన మెడకి బాగా కింద వైపు టాటూ వేయించుకుని యువత కంటికి కునుకును దూరం చేస్తోంది. రష్మిక మందన్నా తన కుడిచేతిపై టాటూతో ముచ్చట పడుతోంది. వీరి దారిలో మరెందరో హీరోయిన్లు టాటూలతో ఆకర్షణీయంగా కనిపించాలని తెగ తాపత్రయ పడుతుంటారు.

త్రిషకి అయితే ఈ టాటూల పిచ్చి మరీ ఎక్కువగా ఉంది. ఈ బ్యూటీ తన చేతి మీదే కాదు వీ షేప్ వద్దా టాటూ వేయించుకుని .. టాటూలపై తనకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే చెప్పేస్తోంది. కమల్ హాసన్ గారాలపట్టి శ్రుతిహాసన్ కూడా టాటూలపై తనకు ఎంత మమకారం ఉందో చెప్పకనే చెబుతోంది. తన వీపు.. మెడ భాగాల్లో టాటూలు వేయింకుని మరీ ఈ అమ్మడు మురిసిపోతోంది. ఇలా నయనతార- ప్రియమణి- తాప్సి- ఇలియానా- చార్మి టాటూలతో కుర్రకారు మనసులో గిలిగింతలు పెడుతున్నారు. అయితే వీరంతా తమ టాటూల వెనుక చాలా కథ ఉందని అది అందరికీ చెప్పబోమని ఫోజు కొడుతున్నారు మరి. అయితే టాటూలతో ఇన్నర్ హాట్ కంటెంట్ ని ఆరాంగా వడ్డించేందుకే భామలు అన్నివేళలా సిద్ధమవుతుంటారని యూత్ భావిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-