బాలయ్య జానపద చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారా?

0

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తారనే టాక్ ఉంది. అయితే తాజాగా బాలయ్య వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.

సింగీతం నివాసానికి బాలయ్య నిన్న స్వయంగా వెళ్లి ఒక గంట పాటు ఆయనతో ముచ్చటించారట. మరి బాలయ్య మర్యాదపూర్వకంగా సింగీతంను కలవడం జరిగిందా.. లేదా ఏదైనా ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చర్చలు సాగాయా అనేదానికిపై ఇప్పుడు జోరుగా స్పెక్యులేషన్లు మొదలయ్యాయి. బాలయ్యతో సింగీతం ‘ఆదిత్య 369′..’భైరవద్వీపం’ సినిమాలు రూపొందించారు. ఈ రెండు సినిమాలూ బాలయ్య కెరీర్లో ప్రత్యేకమైనవి. బాలయ్య తన 100 వ సినిమా ఫైనలైజ్ చెయ్యక ముందు సింగీతంతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేస్తారని టాక్ వినిపించింది కానీ అవి జస్ట్ రూమర్లుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరి ఆయనతో ఆ సీక్వెల్ గురించి చర్చించారని ఒక వెర్షన్ వినిపిస్తోంది. కాదు కాదు.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ భాద్యతను సింగీతంకు అప్పగించే ఆలోచనలో బాలయ్య ఉన్నారని మరో వెర్షన్ వినిపిస్తోంది.

అసలు విషయం ఏంటనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. జానపదాలు.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందించడంలో సింగీతం స్పెషలిస్టు. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఆయన ఇప్పుడు సినిమాను తీయగలరా అనేది అలోచించాల్సిన విషయం. ఎందుకంటేగురువుగారి వయసు 80. చూద్దాం ఏం జరుగుతుందో!
Please Read Disclaimer