చిరంజీవికి ‘తమ్ముడు’ ఎందుకు గుర్తు రాలేదు..?

0

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఆచార్య’. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ రాకతో హీరోయిన్ కష్టాలు తీరిపోయాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా ఇదే కంఫర్మ్ అని తెలుస్తోంది. ‘ఆచార్య’ సినిమాలో చాలా కీలకమైన ఈ పాత్రని చేయమని ఫస్ట్ మహేష్ బాబుని అడిగారట. మహేష్ బాబు ఓకే చేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకోకుండా రామ్ చరణ్ పేరు తెరపైకి వచ్చింది. సినిమా బడ్జెట్ పరిమితుల కారణంగా నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ తోనే ఆ పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం.

ఇంత చర్చ జరిగిన ఈ పాత్ర కోసం చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ ను ఎందుకు సంప్రదించలేదనే టాపిక్ ఇప్పుడు మెగా అభిమానుల్లో చర్చకు దారితీసింది. గతంలో శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రంలో చిరుతో కలిసి నటించింది కొద్దిసేపే. మహేష్ బాబుతో ఆ రోల్ చేయించాలని భావించిన చిరంజీవికి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తు రాలేదని అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా అది నక్సలైట్ పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్ర స్ఫూర్తితోనే ‘ఆచార్య’ తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట. పవన్ కళ్యాణ్ కి ఇలాంటి పాత్రలంటే ఇష్టమని సినీ అభిమానులు అందరికీ తెలిసిన విషయమే. గతంలో జల్సా సినిమాలో ఈ తరహా నక్సలైట్ పాత్ర చేసిన అనుభవం పవన్ కళ్యాణ్ కు ఉంది. ఇది పవన్ కి టైలర్ మేడ్ క్యారెక్టర్ అనిపిస్తున్నా కానీ ఎందుకో చరణ్ తోనే వెళ్తున్నారు. మహేష్ గుర్తొచ్చిన చిరంజీవికి పవన్ ఎందుకు గుర్తు రాలేదో వాళ్ళకే తెలియాలి. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ క్రిష్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-