గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎందుకంత పని చేశాడు?

0

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఆఫర్ వస్తే మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిజెక్ట్ చేసాడా? అంత పెద్ద ఆఫర్ ఎందుకు కాదనుకున్నాడు? ఎందుకింత కఠోర నిర్ణయం తీసుకున్నాడు ఈ గబ్బర్ సింగ్ డైరెక్టర్?.. చెక్ డీటెయిల్స్..

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ పింక్ తెలుగు రీమేక్ గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో గత కొంత కాలంగా ఆసక్తికర చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ కళ్యాణ్ కథానాయకుడి గా నటించేందుకు అంగీకరించారని వార్తలొస్తున్నాయి. దిల్ రాజు- హిందీ నిర్మాత బోనీ కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ ని ఈ చిత్రానికి దర్శకుడి గా ఎంపిక చేసారు. అయితే మొదట పింక్ రీమేక్ ఆఫర్ హరీష్ శంకర్ నే వరించిందిట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ తిరస్కారానికి కారణం ఏంటి? అంటే డైరెక్టర్స్ రేసు లో వెనుక బడి ఉండటం ఓ కారణం అయితే.. సొంత స్క్రిప్టు తోనే బ్లాక్ బస్టర్ కొట్టి నిరూపించుకోవాలి అన్న ఉద్దేశం తోనే రిజెక్ట్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఇటీవలే వరుణ్ తేజ్ కథానాయకుడి గా తమిళ్ సినిమా `జిగరత్తాండ`ను `గద్దలకొండ గణేష్`(వాల్మీకి) పేరుతో హరీష్ దర్శకత్వంలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అబౌ యావరేజ్ గా నిలిచింది ఈ చిత్రం. అంతకు ముందు పవన్ కళ్యాణ్ తో దబాంగ్ ని గబ్బర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన హరీష్ ఆ తర్వాత మళ్లీ ఎందుకనో ఆ రేంజు హిట్టు కొట్టలేకపోయాడు. ఆ తర్వాతా సొంత కథలతో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో అతడిలో కొంత డైలమా నెలకొందట. ప్రస్తుత సన్నివేశంలో రీమేక్ లు కూడా కలిసి రాక పోవడంతో మళ్లీ సొంత స్క్రిప్టు వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ముందుగా ఒక మంచి స్క్రిప్టు రాసుకుని దాంతో బ్లాక్ బస్టర్ కొట్టాకే పవన్ లాంటి అగ్ర హీరో తో పని చేస్తాడట. అంతవరకూ రీమేక్ ల జోలికి వెళ్లడని మాట్లాడుకుంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తీశాక కూడా పవన్ తో మరో ఛాన్స్ కాదనుకున్నాడంటే హరీష్ గట్స్ ని మెచ్చుకోవాలి. అతడిలోని పంతం పట్టుదల బావుంది. అయితే అందులో నెగ్గడం ఇంపార్టెంట్.
Please Read Disclaimer