ఉన్నట్లుండి అడ్డాలపై అందరికి ఇంత నమ్మకం ఏంటో?

0

కొత్త బంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ముకుంద చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత చేసిన బ్రహ్మోత్సవం సినిమాతో ఆయన అంటేనే హీరోలు భయపడే పరిస్థితి వచ్చింది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత దారుణమైన సినిమాగా బ్రహ్మోత్సవం నిలిచింది. దాంతో గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన కథలు వినేందుకు కూడా హీరోలు ఆసక్తి చూపించలేదు. అలాంటిది ఇప్పుడు ఆ దర్శకుడిపై ఒక్కసారిగా నమ్మకం పెట్టుకుంటున్నారు.

ప్రస్తుతం ఈయన వెంకటేష్ తో అసురన్ రీమేక్ ‘నారప్ప’ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ రీమేక్ విడుదల కాకుండానే అప్పుడే శ్రీకాంత్ అడ్డాల మరో సినిమా ఓకే చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. 14 రీల్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ హీరోగా ఈయన సినిమా ఉండబోతుంది. ఇదే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ముకుంద చిత్రంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో నటుడిగా వరుణ్ మంచి పేరు దక్కించుకున్నాడు. అందుకు ఆ సినిమా ఇచ్చినందుకు విశ్వాసంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు వరుణ్ సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల అడ్డాల చెప్పిన ఒక స్టోరీ లైన్ బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం తర్వాత 14 రీల్స్ లో మరో సినిమాను చేసేందుకు వరుణ్ చాలా రోజుల క్రితమే ఓకే చెప్పాడు. ఇప్పుడు ఆ సినిమా శ్రీకాంత్ అడ్డాలతో చేయబోతున్నాడు.

ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మాణంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాను ఈ మెగా ప్రిన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ లో మెలకువలు నేర్చుకుంటున్న వరుణ్ తేజ్ త్వరలోనే రింగ్ లోకి దిగబోతున్నాడు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-