‘మంచి’ వాడి సందడేది ?

0

సంక్రాంతి సినిమాల మధ్య ప్రమోషన్స్ పోటీ గట్టిగా ఉంది. మొన్నటి వరకూ ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ తో హంగామా చేయగా ఇక టీజర్ ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం ప్రమోషన్స్ లో ఇంకా ఎలా ముందుకెళ్ళాలంటూ ప్లాన్స్ వేసుకుంటున్నారు.

అయితే ఈ రెండు సినిమాల కు ప్రమోషన్స్ ఎలా ఉన్నా ఓపినింగ్స్ గ్యారెంటీ కానీ ప్రమోషన్స్ కూడా ప్లస్ అయితే ఇంకా భారీ వసూళ్లు వస్తాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత సంక్రాంతి పోటీ నిలిచిన ‘ఎంత మంచి వాడవురా’ కి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ లేవు. దసరాకి ఓ టీజర్ రిలీజ్ చేసి ప్రస్తుతం స్టిల్స్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియా లో వదులుతున్నారు.

నిజానికి ఆ రెండు బడా సినిమాల కంటే కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమాకే భారీ ప్రమోషన్స్ కావాలి. ఇప్పటి నుండే సినిమాపై హైప్ క్రియేట్ చేసేలా ప్లానింగ్ చేసుకోవాలి. కానీ మంచి వాడవురా టీం ఇంకా ఎలాంటి ప్రమోషన్ మొదలు పెట్టడం లేదు. మరి ఇదే కంటిన్యూ చేస్తే సంక్రాంతి అయినప్పటికీ కళ్యాణ్ రామ్ సినిమా కి ఓపినింగ్స్ రావడం కూడా కష్టమే.
Please Read Disclaimer