గోవా సెంటిమెంట్ ఏమిటో పూరి సర్!

0

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు పూరి-ఛార్మి బృందం. వరుస ఫ్లాపుల తర్వాత పూరీకి పెద్ద రిలీఫ్ ఇది. మెహబూబా చిత్రంతో నిర్మాతలుగా పూరి-ఛార్మి బృందానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే దాని నుంచి కోలుకునే బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ రూపంలో దక్కింది. అందుకే ఇప్పుడు తిరిగి పూరి తనయుడిని బాణంలా సిద్ధం చేస్తున్నాడు.

ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటిస్తున్న రెండో సినిమా ‘రొమాంటిక్’ చిత్రీకరణను ఇక పరుగులు పెట్టించనున్నారట. ఈ చిత్రానికి పూరి శిష్యుడు అనీల్ పాడూరి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. పూరి స్వయంగా స్క్రిప్టును అందించి నిర్మిస్తున్నారు. ఇటీవల ఇస్మార్ట్ ప్రమోషన్స్ తర్వాత దేవరకొండతో ఫైటర్ చిత్రీకరణ కోసం ప్రణాళికలు వేస్తున్న పూరి కొంతకాలంగా ‘రొమాంటిక్’ ని పక్కన పెట్టారు.

తాజాగా గోవా షెడ్యూల్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని గోవాలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో చాలా సీన్లు.. సాంగ్స్ కి స్పైసీనెస్ యాడైంది గోవా షెడ్యూల్ తోనే. అందుకే రొమాంటిక్ కోసం గోవా వెళుతున్నారు. మరో సెంటిమెంటు ఏమంటే గోవాలో పూరి టీమ్ కి వంట వండి పెట్టే ఒక తెలుగావిడ ఉన్నారట. ఆమె వంట ఎనర్జీనిచ్చి సక్సెస్ కి కలిసొస్తోందట. అందుకే మరోసారి అక్కడికే వెళ్లి ఆమె వంట రుచి చూస్తారట. పనిలో పనిగా షూటింగును ఎంజాయ్ చేస్తూ పూర్తి చేస్తారు. దీనిని బట్టి పూరి ఓ ఫార్ములాటిక్ సెంటిమెంటును రొమాంటిక్ కి ఫాలో అవుతున్నారనే అర్థమవుతోంది. కేతిక శర్మ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer