నాకు ఇంత స్పీడ్ పనికిరాదేమో : రష్మిక

0

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక మందన్న ఉంది. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా ఆమెతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన ఈ అమ్మడి క్రేజ్ ఇంకా పెరిగింది. ఇక అల్లు అర్జున్ తో కూడా ఈమె సినిమాను చేసేందుకు సిద్దం అయ్యింది. ఇంకా పలువురు స్టార్స్ కూడా ఈమెను బుక్ చేసేందుకు ఆరాట పడుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

గత మూడు సంవత్సరాలుగా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఉన్న రష్మిక బాగా అలసి పోయిందట. అందుకే రెండు నెలల గ్యాప్ లోనే నాలుగు సార్లు అస్వస్థతకు గురైనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. మూడు సంవత్సరాలుగా బిజీ షెడ్యూల్స్ కారణంగా కనీస విశ్రాంతి కూడా నాకు లేకుండా పోయింది. ఆ విశ్రాంతి కోసం నాకు నేను కాస్త స్పీడ్ తగ్గించుకోవాలని సూచించుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ఒకే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. ఆ కారణంగా ఎప్పుడు బిజీగానే ఉంటుంది.

తెలుగుతో పాటు కన్నడం మరియు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్న రష్మిక వచ్చే ఏడాది నుండి కాస్త మెల్లగా సినిమాలు చేయాలని కావాల్సినంత విశ్రాంతి కూడా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. తనకు తానుగా ఇంత స్పీడ్ పనికి రాదని ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని భావిస్తుందట. నా శరీరం మరియు మైండ్ చాలా ఒత్తిడికి గురవుతుంది. తద్వారా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆమె అంటోంది. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత కాస్త మెల్లగా సినిమాల ఎంపిక చేసుకోవడం.. గ్యాప్ ఉండేలా ప్రయత్నిస్తానంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.
Please Read Disclaimer