వెంకటేశ్ నే పెళ్లి చేసుకుంటానని ఆ హీరోయిన్ ఎందుకు చెప్పేది?

0

వెంకీనే పెళ్లాడతానని ఎందుకు చెప్పేదో రివీల్ చేసింది విజయలక్ష్మీ.. కానీ కొందరికి మంత్రగా పరిచయం.. అందరికి మాత్రం రాశిగానే సుపరిచితురాలు. రెండు దశాబ్దాల క్రితం తన భారీ అందాలతో కుర్రకారుకి కిరాకు పుట్టించిన హీరోయిన్ రాశి. బాలనటిగా సినీ పరిశ్రమకు పరిచయమైనా.. నిండైన తెలుగమ్మాయిగా.. క్యూట్ లుక్స్ తో యూత్ మనసుల్ని దోచేసిన ముద్దుగుమ్మగా రాశీని చెప్పాలి. తాజాగా ఆమె ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో బోలెడన్ని విషయాలు మాట్లాడారు.

ఒక వయసులో ఎవర్ని పెళ్లాడతావ్ అంటే హీరో వెంకటేశ్ నని ఓపెన్ గా చెప్పేసేవారు ఎందుకని? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని చెప్పింది. తనకు ఆరేళ్ల వయసులో వెంకటేశ్ సినిమాల హవా నడిచేదని.. ఆ టైంలో ప్రివ్యూ షోలకు తమకు పాసులు వచ్చేవని.. దీంతో ఎక్కువగా వెంకీ సినిమాల్ని తాను చూసినట్లు చెప్పారు.

దీంతో వెంకీ మీద అభిమానం పెరిగిపోయి.. ఎవర్ని పెళ్లి చేసుకుంటావని అడిగితే.. వెంకటేశ్ నని చెప్పేదానని.. ఇంకెవ్వరినీ చేసుకోనని చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు. కాస్త పెరిగి పెద్దదాన్ని అయ్యాక.. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మీద ఇష్టం పెరిగి.. ఆయన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు.

దాదాపు 75 సినిమాలు చేసిన రాశి.. బాలనటిగా చేసిన హీరోలతో హీరోయిన్ గా చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. బాలయ్యతో బాలగోపాలుడు సినిమాలో బాలనటిగా చేసిన రాశి.. ఆ తర్వాత క్రిష్టబాబు సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశం లభించిందన్నారు. చిన్నప్పుడు ఎంత చక్కగా పలుకరించే వారో.. హీరోయిన్ గా ఉన్నప్పుడు అంతే చక్కగా పలుకరించేవారని.. అప్పుడెలా ఎలా ఉన్నారో.. తాను హీరోయిన్ గా చేసిన సినిమాలోనూ అంతే ఫన్ గా ఉన్నట్లు చెప్పారు.

పద్నాలుగేళ్లకే హీరోయిన్ కావటంతో చాలా సరదాగా ఉండేదని.. షూటింగ్ కు అమ్మానాన్నలు రావటంతో బయట ఎంత క్రేజ్ ఉండేదో కూడా అర్థమయ్యేది కాదని చెప్పారు. సినిమా చూసేందుకు థియేటర్ కు వస్తున్నట్లు తెలిస్తే.. పూలు చల్లేవారని.. అదంతా చాలా సరదాగా అనిపించేదన్నారు. అలా తన పాత విషయాన్ని ఆసక్తిగా చెప్పుకొచ్చారు రాశి
Please Read Disclaimer