ఇంత రిస్క్ ఎందుకు కళ్యాణ్ రామ్ ?

0

నిన్న ఉన్నట్టుండి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఎంతమంచివాడవయ్యాను సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ప్రకటించి కొత్త షాక్ ఇచ్చింది యూనిట్. ఇప్పటికే పోటీ మహా టఫ్ గా ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో క్లాష్ కే పోరు రసవత్తరంగా మారింది. మధ్యలో రజనీకాంత్ దర్బార్ కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి దిగ్గజాల మధ్య పోటీకి కళ్యాణ్ రామ్ ఎదురు వెళ్లడం ఏంటో అర్థం కావడం లేదని ట్రేడ్ వర్గాలే కామెంట్స్ చేసుకుంటున్నాయి.

అసలే కళ్యాణ్ రామ్ మార్కెట్ యావరేజ్ గా ఉంది. చాలా తక్కువ బడ్జెట్ లో తీశారు కాబట్టి 118 సేఫ్ అయ్యింది. అది కూడా పోటీ లేని టైంలో రిలీజ్ చేయడం వల్ల. అలాంటిది సంక్రాంతికి కోడి పుంజుల తరహాలో ఢీకొంటున్న స్టార్ల మధ్య దూరడం అంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా థియేటర్ల సమస్య రాకుండా అయితే పోదు. అందులోనూ పైన చెప్పిన మూడు సినిమాల్లో ఏ రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చినా స్క్రీన్లు అంత సులభంగా మిగిలినవారికి దొరికే ఛాన్స్ ఉండదు. పండగ సీజన్ లో ప్రేక్షకులు సైతం స్టార్ల క్రేజీ సినిమాలకే ఓటు వేస్తారు.

ప్రతిసారి జరుగుతోంది అదే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఏ ధైర్యంతో సాహసం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. గతంలో దర్శకుడు సతీష్ వేగ్నేశ శతమానం భవతి కూడా ఇదే తరహాలో వచ్చినప్పుడు చిరు బాలయ్య సినిమాల వేవ్ ని తట్టుకుని మరీ గెలిచింది. అప్పటికి ఇప్పటికీ సమీకరణాల్లో చాలా మార్పులు వచ్చాయి. అదే కాన్ఫిడెన్స్ ఇప్పుడు పనిచేయకపోవచ్చు. అలాంటిది ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఎంతమంచి వాడవయ్యాను బరిలో దింపుతున్నారన్న కామెంట్స్ కు కాలమే సమాధానం చెప్పాలి
Please Read Disclaimer