అల్లుడు కోసం మహేష్ రాలేదేం ?

0

సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా కథా నాయకుడి గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం లో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముఖ్య అతిథులు గా రామ్ చరణ్.. దగ్గుబాటి రానా హాజరయ్యారు. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ- సీనియర్ నరేష్ సహా ఘట్టమనేని కుటుంబానికి చెందిన వారంతా దాదాపుగా హాజరయ్యారు. అటు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు.. సినీ రాజకీయ వర్గాల్లో సన్నిహితులు కూడా హాజరయ్యారు. కానీ అశోక్ కి ఎంతో ప్రీతిపాత్రుడైన మేనమామ.. సూపర్ స్టార్ మహేష్ మాత్రం హాజరు కాలేదు. దీంతో అల్లుడు సినిమా లాంచ్కి మామ రాక పోవడం ఏమిటో అంటూ.. మీడియాలో రెండు రోజులుగా గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మహేష్ పై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి.

సాధారణం గా మహేష్ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడు. దర్శక నిర్మాతలే ఆ ఘట్టాన్ని పూర్తి చేస్తారు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమా ప్రారంభోత్సవాల్లో మహేష్ పాల్గొన్నాడు. కానీ ఆ సినిమాలేవీ తన కెరీర్ కి ఆశించిన ఫలితాల్ని ఇవ్వని నేపథ్యం లో అప్పటి నుంచి మహేష్ ఇలాంటి లాంచింగ్ కార్యక్రమాల కు దూరంగా ఉంటాడనే రూమర్ ఉంది. ఆ కారణం గానే అల్లుడు సినిమా ప్రారంభం రోజున మహేష్ హాజరు కాలేదని భావిస్తున్నారు. అందుకే మహేష్ స్థానం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పంపించి ఆ వెలితి తీర్చాడని అంటున్నారు.

సెంటిమెంటు పరిశ్రమ లో ఒకసారి ఒక సెంటిమెంటు బలపడితే ఇక అది జీవితాంతం కొనసాగుతుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. మహేష్ తన సినిమాల లాంచింగులకే కాదు.. ఇలా తన ఫ్యామిలీ హీరోల సినిమాల లాంచింగు కి హాజరు కాడన్న మాట. ఇక మహేష్ ఔట్ డోర్ లో ఉండడం వల్ల రాలేక పోయాడన్న ప్రచారం లో నిజం లేదని తేలిపోయినట్టే.
Please Read Disclaimer