ఏదీ తేల్చట్లేదు ఏంటి మహేష్ ?

0

మహేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయి సాంగ్స్ షూట్ లో ఉంది. ఈ నెలాఖరు కల్లా టోటల్ షూట్ పూర్తవుతుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తున్నా మహేష్ మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది కన్ఫర్మ్ చేయకుండా ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెట్టాడు. మొన్నటి వరకూ వంశీ పైడిపల్లి కె 27వ సినిమా అవకాశం ఇస్తాడనే వార్త చక్కర్లు కొట్టగా ఇప్పుడు మళ్ళీ ‘కే.జీ.ఎఫ్’ ప్రశాంత్ నీల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రశాంత్ తోనే మహేష్ నెక్స్ట్ సినిమా చేస్తాడని అనిల్ సుంకరతో తన సొంత బ్యానర్ లోనే సినిమాను నిర్మిస్తాడని అంటున్నారు.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ మహేష్ 27 సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఆ అనౌన్స్ మెంట్ తోనే అన్ని ప్రశ్నలకు ఓ సమాధానం వస్తుంది. మరి మహేష్ ఆ సంగతి చెప్పెదెప్పుడో ?

Comments are closed.