మహానాయకుడు ని ఏం చేయలేక పోయిన నాదెండ్ల

0

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో మాత్రం వివాదాస్పద నాదెండ్ల ఎపిసోడ్ ను కీలకంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ లో ఇప్పటికే నాదెండ్ల వ్యవహారం గురించి క్లారిటీ ఇచ్చారు. మహానాయకుడులో మెయిన్ విలన్ నాదెండ్ల అని తేలిపోయింది. అయితే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సమయంలోనే నాదెండ్ల కుటుంబ సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులను హెచ్చరించారు. నాదెండ్లకు వ్యతిరేకంగా సినిమాలో సీన్స్ ఉంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

షూటింగ్ సమయంలోనే సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పాటు లాయర్ లతో నిర్మాణ సంస్థకు నోటీసులు ఇప్పించడం జరిగిందట. తాజాగా ఈ విషయమై నాదెండ్ల భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మహానాయకుడు సినిమాలో నన్ను విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరికి వెన్ను పోటు పొడవలేదు నన్నే వెన్ను పోటు పొడిచారు. అసలు ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన వారిని వదిలేసి నన్ను విమర్శిస్తున్నారు. ఈ చిత్రంపై ముందు నుండే తన కుమారుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నోటీసులు పంపించాడు.

సెన్సార్ బోర్డు సభ్యులు రూల్ ప్రకారం ఈ సినిమాను ముందుగా మాకు చూపించాలి. కాని సెన్సార్ బోర్డులో ఒక లేడీ ఉందట. ఆమె ఎలా చెబితే అలా అన్నట్లుగా సెన్సార్ జరుగుతుందట. అందుకే సెన్సార్ బోర్డు వారు మహానాయకుడు సినిమాకు ఈజీగా సెన్సార్ చేశారు. మేము ఇంతగా అడ్డు చెబుతున్నా కూడా సెన్సార్ బోర్డు వారు మాత్రం పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా సెన్సార్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఏం చేయలేము. ప్రజలు ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకుంటారు. అందుకే నేను లైట్ తీసుకున్నాను అంటూ నాదెండ్ల చెప్పుకొచ్చాడు.


Please Read Disclaimer