బంగార్రాజు పట్టి ముంచింది కీర్తినా ?

0

అక్కినేని నాగార్జున గత రెండు మూడేళ్లుగా తనతో దోబూచులాడుతున్న సక్సెస్ ని ఎలాగైనా సాధించాలనే కసితో సీక్వెల్స్ పనిలో పడ్డారు. ఇప్పటికే మన్మథుడు 2 దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుని ఇంకో నెలలో విడుదలకు రెడీ అవుతోంది. దీని తర్వాత తనకు సోగ్గాడే చిన్ని నాయన లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు ప్లాన్ చేసుకున్న నాగ్ పక్కా షెడ్యూల్స్ తో పూర్తి చేసి 2020 సంక్రాంతి బరిలో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అయితే దానికా ఛాన్స్ లేదని తేలిపోయింది.

అందరూ బిగ్ బాస్ షోకు కమిట్ కావడం కారణం అనుకుంటున్నారు. వంద రోజుల పాటు సాగే ఆ రియాలిటీ షోలో నాగ్ కు రోజూ పని ఉండదు. కేవలం వీకెండ్లో ఒకటి లేదా రెండు రోజుల షూటింగ్ సరిపోతుంది. ఆ మాత్రానికి ఓ మూవీ ప్రాజెక్ట్ ఆపేసేంత సీన్ ఉండదు. కానీ నిజానికి కారణం వేరే ఉందట. తొలుత బంగార్రాజు కోసం కీర్తి సురేష్ ను తీసుకున్నారు. ఆ కారణంగానే మన్మథుడు 2లో క్యామియో చేసేందుకు ఒప్పుకుని ఆ మేరకు ఫారిన్ లో పూర్తి చేసుకుని వచ్చేసింది.

అక్కడేం జరిగిందో లేక బంగార్రాకు సంబంధించి కథా చర్చల్లో ఏమైనా తేడాలు కనిపించాయో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక అది చేయలేనని నాగ్ టీమ్ కు కబురు పంపిందట. అసలే కొరత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తక్కువ టైంలో నాగ్ కు హీరోయిన్ ని సెట్ చేయడం అంత ఈజీ కాదు. పైగా సంక్రాంతి టార్గెట్ అంటే కేవలం ఐదు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలి. అదేమీ అసాధ్యం కాదు కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే మొత్తంగా బంగార్రాజు రిలీజ్ టార్గెట్ ని మార్చుకుని ఆ తర్వాత ప్లాన్ చేద్దామని నిర్ణయించుకున్నారట నాగ్. ఇది నిజమో కాదో కానీ ఫిలిం నగర్ లో దీనికి సంబంధించిన చర్చలైతే జోరుగా సాగుతున్నాయి.
Please Read Disclaimer