వి మీద నాని సైలెన్స్ ఎందుకు ?

0

న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది మొత్తం మూడు సినిమాల్లో కనిపించబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ వచ్చే నెలాఖరుకు విడుదల కానుండగా దాని మీద నాని చాలా స్పెషల్ ఇంటరెస్ట్ తీసుకుంటున్నాడు. ప్రమోషన్ ను చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ మీద మెగా ఫ్యాన్స్ టార్గెట్ ఉండటంతో కంటెంట్ తో వాళ్ళను ఒప్పించే బాధ్యత కూడా దర్శకుడు విక్రమ్ హీరో నానిల మీద ఉంది. దీంతో పాటుగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న వి షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కానీ దాని ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు.

ఇన్ సైడ్ టాక్ చూస్తేనేమో అందులో నాని కంటే సుధీర్ బాబుకు ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుందని అందుకని స్పెషల్ రోల్ కింద తనది వస్తుంది కాబట్టి నాని లైట్ తీసుకున్నాడని చెబుతున్నారు. ఇందులో నిజమెంతుందో కానీ నాని వి గురించి మౌనంగా ఉండటం దాన్ని బలపరుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవలే నాని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చూసి దర్శకుడు స్వరూప్ ని ప్రత్యేకంగా పిలిచి ఏదైనా లైన్ ఉంటే సిద్ధం చేసుకుని కలవమని చెప్పాడట. దీంతో ఎగ్జైట్ ఆయిన సదరు డైరెక్టర్ వెంటనే ఆ పనిలో ఉన్నట్టు సమాచారం.

కాకపోతే స్టోరీ నచ్చితేనే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టాలెంట్ ని గుర్తించి కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందుండే నాని స్వరూప్ ని అదే త్వరలో ఎంకరేజ్ చేస్తున్నట్టు తెలిసింది. ఒకవేళ పక్కా అయినా కన్ఫర్మేషన్ రావడానికి ఇంకో రెండు మూడు నెలలు పట్టొచ్చు. స్వరూప్ కు అంత కన్నా పెద్ద జాక్ పాటు ఉండదు. దీని సంగతేమో కానీ వి గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడితే ఇలాంటి అనుమానాలు రావు కదా
Please Read Disclaimer