కథనం సౌండ్ ఏది రంగమ్మత్తా ?

0

ఈ నెల 9న విడుదల కానున్న నాగార్జున మన్మథుడు 2 గురించే మాట్లాడుకుంటున్నాం కానీ అదే రోజు యాంకర్ అనసూయ అంతా తానై నటించిన కథనం కూడా రిలీజవుతోంది. మొన్నే ట్రైలర్ కూడా వదిలారు. క్రైమ్ థ్రిల్లర్ గా ఏదో విషయం ఉందనే అభిప్రాయం అయితే దాన్ని చూసిన ప్రేక్షకుల్లో కలిగించారు. అంతే. అంతకు మించి ఒక్క సౌండ్ వినిపిస్తే ఒట్టు. ఇంకో నాలుగు రోజుల్లో విడుదల పెట్టుకుని ఇప్పటిదాకా యాక్టివ్ ప్రమోషన్స్ చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్లు చిన్నోళ్లు అనే తేడా లేకుండా అగ్రెసివ్ ప్రమోషన్ చేస్తేనే జనం మొదటిరోజు ఓ లుక్ వేద్దామా వద్దా అనే ఆలోచనలో పడుతున్నారు. అలాంటిది పోస్టర్లు వదిలాం ట్రైలర్ ని ఇచ్చాం అని ఊరుకుంటే సరిపోదు. పబ్లిక్ లోకి రావాలి. మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. కథనంలో ఏముందో ఎందుకు చూడాలో వివరించి చెప్పాలి. కానీ అనసూయ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్లు లేవు. మొన్నేదో చిన్న ప్రెస్ మీట్ పెట్టింది కానీ దానికి సంబంధించిన సమాచారం కూడా కొందరు ప్రతినిధులకు పూర్తిగా అందలేదట. ఎంత టీవీ షోలలో యాంకరింగ్ లో బిజీగా ఉన్నా కేవలం తన బ్రాండ్ మీద అమ్మిన సినిమా కాబట్టి అనసూయ బాధ్యత తీసుకోవాలి.

ఒకవేళ హిట్ అయితే దర్శకుడి కన్నా ముందు తనకే ఎక్కువ కాంప్లిమెంట్స్ దక్కుతాయి. పైగా కథనంలో తను కేవలం నటనకే పరిమితం కాలేదు. భారీ ఫైట్లు కూడా చేసింది. అలాంటప్పుడు ఎంత యాక్టివ్ గా ఉండాలి. అసలే బజ్ లేక కథనం అనే సినిమా ఒకటి 9న వస్తోందని అనే స్పృహ కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో మడిగట్టుకు కూర్చుకుంటే లాభం లేదు. చేతిలో ఉన్నదే నాలుగు రోజులు. వాటినైనా సరిగా ప్లాన్ చేసుకుని కథనంని జనంలోకి తీసుకెళ్లే మార్గం వెతికితే బెటర్ లేదా ఓపెనింగ్స్ వీక్ గా వచ్చాయే అనే దిగులు మిగలడం తప్ప ఏమి ఉండదు
Please Read Disclaimer