కామ్రేడ్ సరే మరి దీని సంగతేంటి ?

0

ఇంకో రెండు వారాల్లో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. సుమారు ఏడు నెలలకు పైగా గ్యాప్ తో వస్తున్న సినిమా కావడం అభిమానులు ఓ రేంజ్ లో దీని మీద నమ్మకం పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఆడియో సాంగ్స్ తో పాటు టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రేపు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. దీని తర్వాత విజయ్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

అసలు షూటింగ్ ఎక్కడిదాకా వచ్చిందో విడుదల ఎప్పుడు ప్లాన్ చేశారో ఎలాంటి సమాచారం లేదు. అప్పుడప్పుడు ఎక్కడో ఫారిన్ లొకేషన్ లో ఉన్నట్టుగా హీరో పిక్స్ ని సోషల్ మీడియాలోనో వాట్స్ అప్ లోనో షేర్ చేయడం తప్ప అంతకు మించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి లేదు. కంటిన్యూగా సాగుతోందా లేక ఏదైనా బ్రేక్ పడిందా లాంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి

విజయ్ దేవరకొండ సైతం దీని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. ఇది పూర్తిగా అతని ఇమేజ్ మీదే మార్కెట్ చేసుకుంటున్న సినిమా. దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఫామ్ లో లేడు. గత సినిమా సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబుకు తీవ్ర విమర్శలు అందుకున్నారు. నిర్మాత కేఎస్ రామారావుగారు కూడా ఏది చేసినా సక్సెస్ అందటం లేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ వీళ్లకు చాలా ముఖ్యం. కానీ ఇంత నిర్లిప్తంగా ఉండటం వెనుక కారణం మాత్రం అంతు చిక్కడం లేదు.

డియర్ కామ్రేడ్ హడావిడి ముగిశాక దీని గురించి ఏమైనా చెప్తారేమో చూడాలి. రాశి ఖన్నా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు నటిస్తున్న ఈ మూవీలో విజయ్ దేవరకొండ మూడు నాలుగు షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. డియర్ కామ్రేడ్ వచ్చాక వీలైనంత తక్కువ గ్యాప్ లోనే ఇది కూడా రిలీజ్ చేస్తారనే టాక్ ఉంది కాని క్రాంతి మాధవ్ సినిమా కన్నా వేగంగా ఇటీవలే ప్రారంభమైన విజయ్ దేవరకొండ్ బై లింగ్వల్ మూవీ హీరో స్పీడ్ గా ఉండటం గమనార్హం
Please Read Disclaimer