సవ్యసాచి బోణీ బాగుంది

0

తెలుగులో ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్లో రాబోతున్న ఆసక్తికరమైన చిత్రాల్లో ‘సవ్యసాచి’ ఒకటి. ఈ మధ్యే రిలీజైన దీని టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. తెలుగులో ఇప్పటిదాకా చూడని ఒక విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు చందూ. ఆ కాన్సెప్ట్ ఏంటన్నది టీజర్లోనే రివీల్ చేశారు. నవంబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రమోషన్ల జోరు పెంచే ప్రయత్నంలో పడింది. త్వరలోనే ఫుల్ ఆడియో బయటికి రాబోతుండగా.. ఈ రోజు తొలి పాట ‘వై నాట్’ను ఆన్ లైన్లో లాంచ్ చేశారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్నందిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన యూత్ ఫుల్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది.

ఐతే ‘సవ్యసాచి’తో తాను ఈ తరానికి కూడా నచ్చే పాటలు ఇవ్వగలనని చాటేలాగే ఉన్నారు. ఇందుకు ‘వై నాట్’ పాటే నిదర్శనం. ఈ పాట యూత్ కు బాగా నచ్చేలా ట్రెండీగా ఉంది. అనంత్ శ్రీరామ్ క్యాచీగా ఉండే లిరిక్స్ రాస్తే కీరవాణి.. యూత్ ఫుల్ ట్యూన్ తో పాటను అందంగా తీర్చిదిద్దారు. రోహిత్.. మనీషా ఈరబత్తిని ఈ పాటను ఆలపించారు. ఈ పాటను అమెరికాలో చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. రిచ్ లొకేషన్లలో విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆడియో మీద అంచనాలు పెంచేలా చేసిందీ పాట. ఇంకో రెండు సింగిల్స్ లాంచ్ చేసి.. ఆ తర్వాత ఫుల్ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. ‘రంగస్థలం’ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో నాగచైతన్య సరసన బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ నటించింది.
Please Read Disclaimer