‘బిగ్ బాస్’ ను విచారిస్తున్న పోలీసులు.. ఏం జరిగిందంటే…. !

0

బిగ్ బాస్ రియాల్టీ షో- తమిళనాడులో పుట్టిన ఈ టీవీ కార్యక్రమం అనంతరం ఏపీ తెలంగాణల్లోనూ విస్తృతంగా ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలను దాదాపు మూడు నెలల పాటు ఓ చోటకు చేర్చి వారికి వివిధ టాస్క్ లు ఇస్తూ వీవర్ల అభిప్రాయాలను ఓట్లను కూడా షేర్ చేసుకుని వారికి మార్కులు కేటాయిస్తూ.. ఉత్సాహంగా ఉల్లాసంగా సాగేలా- వీక్షకులకు కనువిందు చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి ఎపిసోడ్ కు జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ గా వ్యవహరిస్తే సెకండ్ ఎపిసోడ్ కు నాని ఇప్పుడు మూడోసారి ముచ్చటగా అక్కినేని నాగార్జునలు బాస్ లుగా వ్యవహరిస్తున్నారు.

తొలి రెండు ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన ఈ ఎంటర్ టైన్ మెంట్ అండ్ రియాల్టీ షో.. థర్డ్ టైం మాత్రం తీవ్ర వివాదాల చుట్టూ తిరుగుతోంది. వంద రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలవా ? అని ఒకరిని నీకు ఆఫర్ ఇస్తే.. మా బాస్ ను ఎలా శాటిస్ ఫై చేయగలవంటూ ప్రముఖ టీవీ యాంకర్- జర్నలిస్టు శ్వేతారెడ్డిని నిర్వాహకులు ప్రశ్నించడంతో ఈ మూడో ఎపిసోడ్ తీవ్ర వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఇక నిన్నటికి నిన్న ఈ బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన క్యారెక్టర్ నటి హేమ కూడా దీనిపై చేసిన వ్యాఖ్యలు మరింతగా బిగ్ బాస్ షోలో ఏదో జరుగుతోందనే విషయానికి బలం చేకూర్చాయి.

అక్క అక్క అంటూనే నన్ను తప్పుగా చూపించారు. అసలు బిగ్ బాస్ షోలో జరిగేది ఒకటి.. ప్రజలకు ప్రసారం చేసేది మరొకటి అంటూ బహిరంగ వేదికపైనే హేమ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇలా బిగ్ బాస్ షో.. మూడో ఎపిసోడ్తీవ్ర వివాదానికి కారణంగా మారింది. ఇక గతంలో సెలబ్రిటీల ఎంపిక సమయంలో శ్వేతారెడ్డిని.. అక్కడి నిర్వాహకులు జుగుప్సాకరంగా ప్రశ్నించడంతో ఆమె నేరుగా మీడియా మీటింగ్ పెట్టి బిగ్ బాస్ అంతు చూస్తానంటూ.. హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మహిళా సంఘాలు కూడా జోక్యం చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజులుగా బిగ్ బాస్ నిర్వాహకులను విచారిస్తున్నారు.

ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం. శ్వేతారెడ్డిని ఎవరు ఇంటర్వ్యూ చేశారు ఆమెతో ఏ ప్రశ్నలు అడిగారు? మొదట ఓకే చెప్పి తర్వాత ఆమెను తిరస్కరించడం వెనుక కథేంటి? వంటి అంశాల గురించి పోలీసులు ఆరాతీసినట్టుగా సమాచారం. తాము వంద ప్రశ్నల వరకూ అడిగిన తర్వాతే ఎవరినైనా బిగ్ బాస్ హౌస్ లోకి సెలెక్ట్ చేస్తామంటూ చెప్పారట నిర్వాహకులు. ఆ వంద ప్రశ్నల జాబితాను వారు ఏకరువు పెట్టినట్టుగా తెలుస్తోంది. పాపులారిటీని బట్టి తమ రియాలిటీ షోకు ఎంపిక చేయడం ఉంటుందని వారు చెప్పారట! పాపులారిటీ సంగతి సరేకానీ కాస్టింగ్ కౌచ్ సంగతేమిటో పోలీసులు తేల్చాల్సి ఉంది.
Please Read Disclaimer