అందుకే జక్కన్న స్టార్ హీరోయిన్ ను తీసుకోలేదా?

0

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’ లో దాదాపుగా నటీనటులందరూ ఫైనలైజ్ అయ్యారు.. షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది కానీ ఎన్టీఆర్ కు జోడీగా నటించే హీరోయిన్ పేరును మాత్రం నిన్నే వెల్లడించారు. కథానుసారం ఈ పాత్రలో ఒక విదేశీ వనిత నటించాల్సి ఉంది. అందుకే ఒలివియా మోరిస్ ను ఎంపిక చేశారు.

థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా మోరిస్ ను సెలెక్ట్ చేయడం రాజమౌళి అండ్ టీం ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి మాత్రం ఈ ఎంపికపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కోసం ఒక హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవడం అంత సులువేమీ కాదు. ఆమెకు ఇవ్వాల్సిన పారితోషికం.. ఇతర ఖర్చులు లెక్కేస్తే ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ కు సమానం అవుతాయి. అందుకే జక్కన్న బృందం పెద్ద స్టార్ హీరోయిన్ కు బదులుగా నటనలో పట్టు ఉండే ఒక విదేశీ అమ్మాయిని ఎంచుకున్నారు.

అంతే కాకుండా ఎన్టీఆర్ హీరోయిన్ చాలా యంగ్ గా ఉండాలి.. హాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల వయసు ఎక్కువగా ఉంటుంది. టీనేజ్ లో ఉండేవారు .. ఇరవైల వయసు ఉండే స్టార్ హీరోయిన్లు FBI ఏజెంట్ ఆత్రేయ స్వయంగా హాలీవుడ్ కు వెళ్లి వెతికినా కూడా కనిపించరు. అందుకే జక్కన్న టీమ్ ఒలివియాను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. అయినా ఇలాంటి విషయాల్లో జక్కన్న సెలెక్షన్ ఎప్పుడూ సూపర్ గానే ఉంటుందని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవచ్చు.
Please Read Disclaimer