అల్లుడి సినిమాకు సూపర్ స్టార్ నో ఎందుకు చెప్పాడు?

0

ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పవర్ పాండి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ ఉత్సాహంతోనే ప్రస్తుతం ‘నాన్ రుద్రన్’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా చర్చల్లో నానుతోంది. మొదట ఈ చిత్రంను వంద కోట్లకు మించిన బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్నాడు. సినిమాలో కీలక పాత్ర కోసం రజినీకాంత్ ను అనుకున్నాడు.

నాన్ రుద్రన్ కథ విన్న రజినీకాంత్ చాలా బాగుందన్నాడట. అయితే తన వయసు రీత్యా మరియు ఆరోగ్యం దృష్ట్యా తాను ఆ పాత్రను చేయలేను అన్నాడట. దాంతో బడ్టెట్ కాస్త తగ్గించి రజినీకాంత్ అనుకున్న పాత్రను నాగార్జునతో చేయించేందుకు ధనుష్ సిద్దం అయ్యాడు. కొన్నాళ్ల క్రితం సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. నాగార్జున కూడా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే మహమ్మారి వైరస్ మొత్తం పరిస్థితిని తలకిందులు చేసింది.

మొదట ఈ చిత్రంలో నాగార్జున ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు ఆ పాత్రకు నాగార్జున సిద్దంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది. తనాన్ రుద్రన్ సినిమాలో ధనుష్ తో పాటు రజినీకాంత్ నటిస్తేనే బాగుంటుందనే అభిప్రాయంను తమిళ ఆడియన్స్ బలంగా వ్యక్తం చేస్తున్నారు. కాని రజినీకాంత్ మాత్రం ఇప్పటికి ఆ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఆయన ఆరోగ్యంకు అనుగుణంగానే పాత్రను డిజైన్ చేస్తే బాగుంటుందేమో అని అభిమానులు అంటున్నారు. కాని ధనుష్ మాత్రం ప్రస్తుతానికి సినిమాను పక్కకు పెట్టినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer