రానా శస్త్ర చికిత్స అసలేమైంది?

0

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో రానాకు అమెరికాలో శస్త్ర చికిత్స నిర్వహించనున్నారని వార్తలొచ్చాయి. అందుకోసం తన తల్లిదండ్రులు సురేష్ బాబు- లక్ష్మీల తో కలిసి రానా అమెరికా వెళ్లారన్న ప్రచారం సాగింది. రానాకు కిడ్నీ ఆపరేషన్ చేయాల్సి ఉందన్న ప్రచారం అభిమానుల్లో చర్చకు వచ్చింది. ఇంతకీ రానా ప్రస్తుత పరిస్థితేంటి? అన్నది ఆరాతీస్తే తాజాగా ఓ సమాచారం తెలిసింది.

రానాకు కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే చికిత్స ద్వారా పరిష్కారం కోసమే అమెరికా వెళ్లారని చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం… ఈ నెల 18న అమెరికా చికాగోలో రానాకి సంక్లిష్టమైన కిడ్నీ సర్జరీ పూర్తి చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమైంది. రానా ఆరోగ్యానికి వచ్చిన సమస్యేమీ లేదు. అతడి హెల్త్ నిలకడగానే ఉందని తెలుస్తోంది. చికిత్స అనంతరం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

కెరీర్ పరంగా పరిశీలిస్తే.. రానా ఇటీవలే హౌస్ ఫుల్ 4.. హాథీ మేరా సాథీ చిత్రీకరణలు పూర్తి చేశారు. అలాగే విరాట పర్వం.. హిరణ్యకసిప చిత్రాల్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే మూడు నెలల వరకూ అతడికి షూటింగులకు వెళ్లడం కుదరదని సన్నివేశం ఉందని అర్థమవుతోంది.
Please Read Disclaimer