అరేరె.. రష్మికను అంత లైట్ తీసుకున్నారే..

0

సినిమా అన్న తర్వాత హీరోకు ఉండే ప్రాధాన్యత ఎంతో.. అంత లేకున్నా ఎంతో కొంత హీరోయిన్ కు ఉంటుంది. ఒక సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు.. అందులో ఒక్క ఫ్రేమ్ లో అయినా హీరోయిన్ ఉండటం.. ఆమె క్యారెక్టర్ ను పరిచయం చేయటం కామన్ గా చేస్తుంటారు. తాజాగా విడుదలైన మహేశ్ తాజా చిత్రమైన సరిలేరు నీకెవ్వరు చిత్ర టీజర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గీతాగోవిందం భామగా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయిన ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆమెకు సంబంధించిన ఒక్కఫ్రేమ్ లేకుండా సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదల చేయటంపై ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.

శుక్రవారం విడుదలైన క్షణం నుంచి సరిలేరు నీకెవ్వరు టీజర్ యూట్యూబ్ లో దూసుకెళుతోంది. మిలియన్ల వ్యూస్ నమోదవుతూ.. కొత్త రికార్డుల దిశగా ప్రయాణిస్తోంది. నిమిషం 22 సెకన్ల నిడివి ఉన్న టీజర్ లో చిత్రంలోని ప్రధాన పాత్రల్ని పరిచయం చేసినా.. హీరోయిన్ రష్మికను మాత్రం లేకపోవటం దర్శకుడిదే బాధ్యత అంటున్నారు.

ఎంత హీరోయిన్ అయితే మాత్రం అంత సింఫుల్ గా తీసిపారేసినట్లు టీజర్ కట్ చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. టీజర్ చూసిన రష్మిక కంగుతిన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆమెకు అనిల్ భారీ షాకిచ్చారన్న చర్చ సాగుతోంది. అయినా.. హీరోయిన్ ప్రస్తావన లేకుండా టీజరేంది భయ్ అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. దర్శకుడి తీరుపై రష్మికను అభిమానించే వారు తీవ్రంగా ఫీలైపోతున్న వేళ.. మరి రష్మిక పరిస్థితి మరెలా ఉంటుందో ఊహించుకోండి? అన్న ప్రశ్న సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer