సాహో సోలోగా ఎందుకు రావడం లేదు ?

0

బాష ఏదైనా ఒక సినిమా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రెండేళ్ల పాటు దేశ విదేశాల్లో షూటింగ్ జరుపుకుని విడుదల కాబోతోందంటే హడావిడి మాములుగా ఉండదు . ఎక్కడ చూసిన దాని గురించిన చర్చే కనిపించాలీ. మీడియాలో వాటి తాలుకు వార్తలే హై లైట్ అవ్వాలి. కాని పట్టుమని నెలరోజులే చేతిలో ఉన్నా సాహో విషయంలో అలాంటి ఊపేది కనిపించకపోవడం అభిమానులను ఖంగారు కలిగిస్తోంది.

ఇలాంటి విజువల్ వండర్ బరిలో ఉందంటే ఎంత పెద్ద అపోజిషన్ స్టార్ హీరో అయినా పోటీ విషయంలో వెనుకడుగు వేస్తాడు. బాహుబలి కోసం అనవసరంగా పోటీకి వెళ్ళడం ఇష్టం లేక మహేష్ బాబు తన శ్రీమంతుడుని వాయిదా వేసుకోవడం అప్పట్లో ఇద్దరికీ మేలు చేసింది. కాని సాహో విషయంలో అలాంటి సంఘటనలు కాని పాజిటివ్ వైబ్రేషన్స్ కాని ఏమి కనిపించడం లేదు

దీనికి ఎవరు బాధ్యులు అని సదరు నిర్మాణ సంస్థ స్వీయ విశ్లేషణ చేసుకుంటే బెటర్. బాలీవుడ్ తారలతో నిండిపోయిన సాహోలో తొంభై శాతం పైగా వాళ్ళే ఉన్నారు. సరే పాన్ ఇండియా మార్కెట్ కోసం అనుకుంటే దీన్నేమాత్రం లెక్క చేయం అనే తరహాలో అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ జాన్ అబ్రహాం బాట్లా హౌస్ ఆగస్ట్ 15కే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం చూస్తే సాహోని ఎంత లైట్ తీసుకున్నారో అర్థమవుతుంది.

ఇక్కడ కూడా నాగార్జున తన మన్మధుడు 2ని సాహోకు కేవలం ఆరు రోజులు ముందుగా ఆగస్ట్ 9 లాక్ చేశాడు. సాహో వచ్చాక థియేటర్ల బెడద ఉంటుందని తెలిసినా ఇంత రిస్క్ కు సై అన్నారంటే ప్రోడక్ట్ మీదున్న నమ్మకమేగా. ఇవే అనుకుంటే తమిళ మలయాళం బాషలలో సైతం కొన్ని సినిమాలు షెడ్యూల్ అవుతున్నాయి.

సో సాహోకి ఏ బాషలోనూ సోలో వెల్కం లేదు. ఖచ్చితంగా పోటీ పడాల్సిన రిస్క్ తో పాటు థియేటర్లను షేర్ చేసుకోవాల్సిందే. సాహో ఒకటే ఉంటే ఆప్షన్ లేదు కాబట్టి ప్రేక్షకులు బాగున్నా లేకపోయినా మొదటివారం దీనికే మొగ్గు చూపుతారు. కాని ఇప్పుడు ముందు వెనుకా ఆప్షన్స్ చాలా వస్తున్నాయి. ఇప్పటికే సాహో మొదటి ఆడియో సింగల్ కి రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. ఇకనైనా జోరు పెంచాలి. ఇప్పుడీ పోటీ ప్రహసనం చూస్తుంటే వ్యవహారం అంత ఈజీగా ఉండేలా లేదు. పోటీకి రావాలన్న ఆలోచనే చేయకుండా హైప్ తేవలసిన సాహో టీం నిర్లిప్తతే ఇప్పుడీ పరిస్థితికి కారణమంటే కాదనగలమా
Please Read Disclaimer