ఫంక్షన్ లో సమంత ఎందుకు కనిపించలేదు?

0

లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెద్ద వేడుకలా జరగటం తెలిసిందే. ప్రతి ఏటా ఈ అవార్డుల ఫంక్షన్ ను నిర్వహించాల్సి ఉన్నా.. గడిచిన ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించలేదు. దీంతో.. రెండేళ్లకు సంబంధించిన పురస్కారాల్ని నిన్నటి కార్యక్రమంలో అందజేశారు.

భారీ ఎత్తున ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టాలీవుడ్ కు చెందిన పలు విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాగా.. బాలీవుడ్ నుంచి కొందరు హాజరయ్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబానికి చెందిన వారంతా హాజరయ్యారు. కాకుంటే.. అక్కినేని నాగార్జున పెద్ద కోడలు సమంత మాత్రం కనిపించకపోటం ఆసక్తికరంగా మారింది. ఇంటి ఫంక్షన్ లో సామ్ ఎందుకు లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల వారు పాల్గొన్న కార్యక్రమంలో సామ్ గైర్హాజరుకు కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

సమంత నటిస్తున్న 96 షూటింగ్ పూర్తి అయిపోయింది. మరి.. అలాంటప్పుడు ఆమెకు ఎలాంటి కమిట్ మెంట్స్ లేవుగా? అన్న ప్రశ్నను కొందరు వేస్తుంటే.. అక్కినేని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారు మాత్రం.. సమంత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వారి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందున బిజీగా ఉండి రాలేకపోయి ఉండొచ్చంటున్నారు.

అవార్డుల ఫంక్షన్ కు ఒకట్రెండు రోజుల ముందు దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ న్యూయార్క్ లో ఉన్నారని.. అలాంటి ఆయన ఈ కార్యక్రమం కోసం హాజరైనప్పుడు ఇంటి ఫంక్షన్ విషయంలో సమంత ఎందుకు రాలేకపోయిందన్నది ప్రశ్నగా మారింది. మరి.. సమంత దీనిపై క్లారిటీ ఇస్తారా? నాగచైతన్య బదులిస్తారో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home