స్టార్ హీరోయిన్ సినిమాకేమైంది?

0

స్టార్ హీరోయిన్ నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ సినిమా అంటే ఎలాంటి బజ్ ఉండాలి. అలాంటి బజ్ లేకుండానే స్టార్ హీరోయిన్ సినిమా తెరకెక్కుతుంది. అవును షూటింగ్ చివరి దశకు చేరిందంటూనే సినిమాను ఎప్పటికప్పుడు పక్కన పెడుతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. సినిమా వచ్చేస్తుందంటూ హడావుడి మొదలెట్టారు. టీం అందరూ కలిసి ఓ ప్రెస్ మీట్ పెట్టి జనవరి రిలీజ్ అన్నారు. కట్ చేస్తే హీరోయిన్ ఆ ప్రెస్ మీట్ కూడా రాకపోవడం అందరిలో ఓ ప్రశ్న మొదలయ్యేలా చేసింది.

కట్ చేస్తే ఆ స్టార్ హీరోయిన్ ఇటివలే ఓ యంగ్ హీరో నిర్మించిన సినిమాకు గెస్ట్ ఎటెండయింది. అయితే అసలు స్టార్ హీరోయిన్ సినిమాకు ఏమైంది…? షూటింగ్ పూర్తయిందా అయితే ఇంకా ఎందుకు ఆలస్యం జరుగుతుంది. హీరోయిన్ అసలు సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉండటానికి రీజన్ ఏంటి ? ఇవే ఇప్పుడు ఆ సినిమా చుట్టూ తిరుగుతున్న ప్రశ్నలు.

నిజానికి ఈ పాటికే సినిమా రిలీజవ్వాల్సింది. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ అవ్వకపోవడం పైగా ప్రమోషన్స్ కి కావలసిన బడ్జెట్ లేకపోవడం వళ్ళే రిలీజ్ లేటవుతుందని అంటున్నారు. ఈ సినిమా వెనకుండి నడిపిస్తున్న ఓ రైటర్ కూడా రిలీజ్ ప్లానింగ్ లో వెనకబడి సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడని అంటున్నారు. మరి స్టార్ హీరోయిన్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడో సందడి చేసేదెప్పుడో…?
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-