అంత సాహసం ఎందుకు సూర్యా ?

0

సౌత్ లో ఏదైనా క్రేజీ స్టార్ హీరో మూవీ వస్తోంది అంటే సాధారణంగా బరిలో ఎవరూ ఉండేందుకు ఇష్టపడరు. బాహుబలి టైంలో శ్రీమంతుడుతో క్లాష్ అయ్యే పరిస్థితి వస్తే మహేష్ బాబే తన సినిమాను కాస్త పోస్ట్ పోన్ చేసుకుని ఇద్దరికీ హెల్ప్ అయ్యాడు. సాహో లాంటి విజువల్ యాక్షన్ ఫీస్ట్ వచ్చినప్పుడు కూడా అలాంటివి ఎదురుకావడం సహజం. కానీ ఈసారి సూర్య మాత్రం అదేమీ జాన్తా నై అంటున్నాడు.

అతని కొత్త సినిమా కాప్పన్ (తెలుగు ‘బందోబస్త్) వచ్చే నెల 30 విడుదలకు రెడీ అవుతోంది. చాలా కాలం క్రితమే ఆగస్ట్ 15 అని ఫిక్స్ అయ్యారు. కానీ సాహోని అదే డేట్ కి లాక్ చేయడంతో వెనక్కు తగ్గి రెండు వారాలు వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడు సాహో కూడా ఆగస్ట్ 30 రాకతప్పని పరిస్థితి. మరి ఇండిపెండెన్స్ డే ఫ్రీ అయ్యింది కదా అప్పుడు వస్తారా అంటే నిర్మాణ సంస్థ లైకా ససేమిరా అంటోందట

సాహో వచ్చినా పర్వాలేదు క్లాష్ అవ్వాలనే నిర్ణయం తీసుకుంది. మోహన్ లాల్ ఉన్నాడు కాబట్టి కేరళలో భారీ విడుదల దక్కుతుంది. కర్ణాటకలో సూర్య ఫాలోయింగ్ చిన్నదేమీ కాదు కాబట్టి మంచి రిలీజ్ అందుకోవచ్చు. ఇక తమిళనాడులో మాములుగానే రీజనల్ ఫీలింగ్స్ ఎక్కువ. అందులో స్టార్ హీరో సూర్య. సో సాహో కన్నా దీనికే ప్రాధాన్యం ఇస్తారు.

ఎటొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయినా కూడా డోంట్ కేర్ అని లైకా సంస్థ అదే డేట్ కి పోటీకి సై అంటోందట. భారీ వ్యయంతో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బందోబస్త్ లో మోహన్ లాల్ ప్రధాన మంత్రిగా సూర్య చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే దీని మీద అంచనాలు కోలీవుడ్ లో భారీగా ఉన్నాయి. సాహోతో స్ట్రెయిట్ గా పోటీ పడుతూ కాలు దువ్వుతున్న బందోబస్త్ మీద యూనిట్ కి గట్టి నమ్మకమే ఉంది
Please Read Disclaimer