మిల్కీ క్వీన్ కి ఏమయ్యింది ?

0

ఎప్పుడో మూడేళ్ళ క్రితం వచ్చి శాటిలైట్ తో పాటు డిజిటల్ స్ట్రీమింగ్ లో అరిగిపోయిన బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీకి మొదట నీలకంఠ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏవో అభిప్రాయభేదాల వల్ల ఆయన తప్పుకోగా ఆ స్థానంలో బాలన్స్ పూర్తి చేయడానికి కల్కి ఫేమ్ ప్రశాంత్ వర్మ వచ్చాడు. అయితే డైరెక్టర్ గా తనకు క్రెడిట్ ఇవ్వకూడదు అనే కండిషన్ మీద బాధ్యతలు తీసుకున్నాడు.

షూట్ పూర్తయ్యిందనే ఫీలర్ వదిలారు కానీ దానికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. మూడు నెలల క్రితమే టీజర్ రిలీజ్ చేస్తే దానికీ రెస్పాన్స్ సోసోగానే వచ్చింది. అయితే ఆలస్యానికి మరో కారణం ఉందని ఫిలిం నగర్ గాసిప్. దాని ప్రకారం తమన్నా అసలు స్టోరీని కాస్త పక్కన పెట్టి కొన్ని కమర్షియల్ అంశాలు జోడించమని చెప్పిందట. కానీ అలా చేయడం ఇష్టం లేని దర్శకుడు నో చెప్పడంతో మళ్ళీ ఇది తాత్కాలికంగా వాయిదా పడిందని సదరు పుకార్ల సారాంశం.

నిజమో కాదో తెలియదు కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీంతో పాటు కాజల్ అగర్వాల్ చేసిన తమిళ్ వెర్షన్ పరుల్ యాదవ్ కన్నడ వెర్షన్ మంజిమా మోహన్ మలయాళం రీమేకులు హోల్డ్ లో పడిపోయాయి. ఒకేసారి విడుదల చేయాలి కాబట్టి ప్రతీ వెర్షన్ క్లియర్ అయితే తప్ప ముందుకు వెళ్లలేని పరిస్థితి. చివరికి ఏమవుతుందో మరి వేచి చూడాలి. యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ అందకపోవడంతో ఆయా హీరొయిన్ల అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడటం లేదు.
Please Read Disclaimer