నాగబాబులో ఈ మార్పుకి కారణమేంటి…?

0

మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల బాలయ్య ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దీనిపై విమర్శలు రావడంతో నాగబాబు సైలెంట్ అయిపోయారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ‘నా ఛానల్ నా ఇష్టం’ అనే తన యూట్యూబ్ ఛానల్ ని ‘మన ఛానల్ మన ఇష్టం’ అని మార్చేశారు మెగా బ్రదర్. ఈ ఛానల్ లో వివాదాలకు దారితీసే వీడియోలు ఉండవంటూ చెప్పుకొచ్చాడు. దీనికి తగ్గట్టే ఇప్పుడు లేటెస్టుగా నాగబాబు ఎవరినో టార్గెట్ చేయకుండా చాలా సౌమ్యంగా.. భాష దాని ప్రాముఖ్యత.. దాని ప్రభావం తదితర విషయాలు చెప్తూ ఓ వీడియో పోస్ట్ చేసారు. మనుషులు మాట్లాడే భాష వల్లే అనేక అనర్థాలు జరుగుతున్నాయని.. అనేక వివాదాలకు కారణమవుతాయని.. భాషను హద్దులు లేకుండా మాట్లాడటం వల్ల మనస్పర్ధలు కూడా పెరిగిపోతున్నాయని నాగబాబు వెల్లడించారు.

నాగబాబు మాట్లాడుతూ.. ”ఎక్కువ శాతం మనుషులు మాట్లాడే మాటలు పనికిరానిదే. దాని వల్లనే అనేక సమస్యలు వస్తున్నాయి. కొన్నిసార్లు మాట్లాడటం కంటే సైగలు ఎమోషన్స్ పలికిస్తే అంత ప్రభావం ఉండదు. అలాగే కొన్నిసార్లు మాటల కంటే సైగలు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి అనే విషయం ఓ ప్రముఖుడు చెప్పిన విషయాలు నాకు ఎంతో నేర్పాయి” అని చెప్పారు. ప్రపంచంలోని చాలా గొడవలకు భాషే కారణం. కొన్నిసార్లు పీక కోస్తాం.. నరకేస్తాం అంటూ చెప్పేమాటలు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అదే మాటలు సైగలతో చెప్తే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. భాష వల్లే మనషుల మధ్య సమస్యలు సృష్టిస్తాయనే విషయం కొత్తగా చెప్పాల్సిన మాట కాకపోయినా.. అవసరం వచ్చిందనే ఫీలవుతున్నాను కాబట్టి చెప్తున్నాను అని నాగబాబు అన్నారు. అందుకే భాషను చాలా జాగ్రత్తగా వాడాలని నేను అందరికీ చెప్పాలనుకొంటున్నాను అని చెప్పుకొచ్చాడు.

సినిమాల్లో ‘ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే’ అంటే భలే చెప్పారనే ఫీలింగ్ కలిగింది. అలాగే ‘మొక్కే కాదా అనే పీకితే పీక కోస్తా’ అనే డైలాగ్స్కు ప్రేక్షకులను ఒక ఫీలింగ్ కు గురిచేస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి డైలాగ్స్ చెబితే చాలా గొడవలు అయిపోతాయి. ‘తంతానురో జాగ్రత్త’ అని చెప్పడానికి ‘తన్నడానికి’ చాలా తేడా ఉంది. దేశాల మధ్య మతాలకు మతాల మధ్య గొడవలు రావడానికి కారణం కూడా భాషే. ప్రపంచం అభివృద్ధి చెందాలన్నా.. నాశనం అవ్వాలన్నా భాషనే ప్రధానం అని నాగబాబు పేర్కొన్నారు. కొన్నిసార్లు వ్యక్తులు ఆవేశంలో ఉపయోగించే భాష సమస్యలను సృష్టిస్తుంది. ‘మనిషివా.. పశువువా’ అనే మాటలు కొన్నిసార్లు చాలా గొడవలకు కారణమవుతాయి. కొన్నిసార్లు ఇద్దరి మధ్య హాస్యానికి కారణమవుతాయి.

భాష అనేది అందరి మనోభావాలను దెబ్బతీస్తుంది. ఇది నాకు చెప్పాలనిపించింది. పాటిస్తే పాటించండి లేకపోతే వదిలేయండి అంటూ మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు. ఇటీవల బాలకృష్ణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన నాగబాబు ఇప్పుడు భాష గురించి చెప్పడం అందరిలో ఆసక్తిని రేపింది. నాగబాబు తాను చేసిన తప్పును తెలుసుకొని నడుచుకుంటున్నాడంటూ బాలయ్య ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer