ఆరవ మోజు తగ్గించుకుంటే బెటరేమో

0

ఒక బాషలో స్టార్ గా ఎదుగుతున్నప్పుడు పక్క రాష్ట్రాల మార్కెట్ పై కన్ను పడటం సహజం . కాని అక్కడ సక్సెస్ అవ్వడం అనేది చాలా అంశాలను ఆధారం చేసుకుని ఉంటుంది. అంత పెద్ద రజనికాంత్ కు ఒకప్పుడు ఇక్కడ మన పెద్ద హీరోలతో సమానంగా సినిమాలకు డిమాండ్ ఉండేది. కాని మొన్న వచ్చిన పేట తమిళ్ లో వంద కోట్లు వసూలు చేస్తే ఇక్కడ ఆఫ్ట్రాల్ ఐదు కోట్లకు కిందా మీద పడింది. విక్రంని ఒక టైంలో నెత్తి మీద పెట్టుకున్న మనవాళ్ళు అతని కొత్త మూవీ వచ్చిందంటే ఆ ధియేటర్ పరిసరాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు.

ఇది రెండు వైపులా ఉంటుంది. మన దగ్గర ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన మగధీర – శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ డబ్బింగ్ చేస్తే అక్కడ జస్ట్ యావరేజ్ అయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి కాని ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఓ యూత్ హీరో. అతనికి క్రేజ్ రాకెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. కెరీర్ స్లోగానే స్టార్ట్ అయినా ఒక్క కల్ట్ క్లాసిక్ లవ్ స్టొరీ యూత్ లో క్రేజీ బాయ్ గా మార్చేసింది. ఇంకో ప్రేమ కథ 60 కోట్లకు పైగా షేర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎందరో సీనియర్ హీరోలకు ఈర్ష్య కలిగేలా చేసింది. ఇప్పుడు ఇంకో కొత్త సినిమా వస్తోంది.

అన్ని రాష్ట్రాలు రౌండ్ అప్ చేసి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. అరవంలోకి డబ్ చేసినా స్ట్రెయిట్ ఫిలిం రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు. గత ఏడాది అక్కడో సినిమా చేసి తెలుగులోకి డబ్ కొడితే రెండు చోట్లా బోల్తా కొట్టింది. ఐదు కోట్ల షేర్ కే ముచ్చెమటలు పోసుకుంది. అయినా మోజు తీరక ఇంకో తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మల్టీ లాంగ్వేజ్ లో భారీ సినిమా సైన్ చేశాడు. అయినా తెలుగులోనే పెద్ద స్టార్ గా ఎదిగేందుకు బంగారం లాంటి అవకాశాలు పెట్టుకుని ఇలా తమిళ మార్కెట్ మోజులో పడటం ఏమిటా అనే కామెంట్స్ వినిపిస్తున్నా అవేవి ఆ హీరో పట్టించుకోవడం లేదు. అసలే ప్రాంతీయ భావాలు విపరీతంగా ఉండే తమిళనాట మన స్ట్రాటజీలు వర్క్ అవుట్ కావనే సత్యం త్వరలోనే తెలిసి రావడం ఖాయం.
Please Read Disclaimer