తంబీల వెంట పడుతున్నారెందుకు?

0

ప్రతిభ కోసం వెతుక్కుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా కేటగిరీ సినిమాల వెల్లువ అంతకంతకు వేడెక్కిస్తుండడంతో ఇరుగు పొరుగు భాషల నటీనటుల్ని అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. ఇటీవలే రిలీజైన సాహో- సైరా లాంటి భారీ చిత్రాల్లో ఇరుగుపొరుగు భాషల నటీనటులకు విరివిగా ఛాన్సులొచ్చాయి. అరుణ్ విజయ్ .. విజయ్ సేతుపతి లాంటి తమిళ స్టార్లు వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు దర్శకరచయిత సముథిర ఖని తెలుగు సినిమాల్లో బిజీ అవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఆర్.ఆర్.ఆర్ లో ఓ కీలక పాత్రకు సముథిర ఖనిని ఎంపిక చేసుకున్నారు. అతడి లుక్ ఎలా ఉంటుందో ఇంతకుముందు రివీలైంది. 1945 కాలానికి తగ్గట్టు అతడు రెట్రో లుక్ లో పక్కపాపిడి బెల్ బాటమ్ తో కనిపించాడు.

ఇప్పుడు మాస్ మహారాజ సినిమాలోనూ అవకాశం దక్కింది. రవితేజ- గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ మూవీలో తమిళ నటుడు సముథిర ఖనికి బెర్త్ ఖాయమైంది. ఆ మేరకు అతడి ముఖ చిత్రంతో పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. రవితేజ 66 త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుంది. ఇక ఎస్.ఎస్.రాజమౌళితో పాటు మాస్ మహారాజాకి ఈ తంబీ స్టార్ ఎంతో సన్నిహితుడు. చాలా కాలంగా వీరి మధ్య స్నేహం ఉంది. సముథిర ఖని దర్శకత్వం వహించిన నాడోడిగల్ రీమేక్ `శంభో శివ శంభో`లో రవితేజ నటించారు. ఆ స్నేహమే ఇలా అవకాశాలు తెచ్చి పెడుతోంది.
Please Read Disclaimer