త్రివిక్రమ్ కే ఎందుకిలా ?

0

ఎప్పటి కప్పుడూ ఓ డిఫరెంట్ టైటిల్ తో ప్రేక్ధకుల ముందుకొచ్చే త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాకు కూడా అదే రూట్లో తన మార్క్ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాకు ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. టైటిల్ ను రివీల్ చేస్తూ బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో వీడియో ద్వారా తెలిపాడు. అయితే ఈ టైటిల్ రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొట్టిందే. అదే టైటిల్ ను ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారంతే.

ఈ మధ్య త్రివిక్రమ్ ప్రతీ సినిమాకు ఇదే జరుగుతుంది. సోషల్ మీడియాలో టైటిల్ ముందే లీకవుతుంది. అత్తారింటికి దారేది – అఆ- అజ్ఞాత వాసి ఇప్పుడు అల వైకుంఠపురములో. నిజానికి ఏదైనా సినిమా టైటిల్ బయటికొచ్చినా ఇది కాదేమో అనుకుంటాం. అంత సులువుగా నమ్మలేము. కానీ త్రివిక్రమ్ సినిమా టైటిల్ బయటికొస్తే నమ్మాల్సిందే. ఎలాగో అనౌన్స్ చేసేది ఆ టైటిల్ కాబట్టి నమ్మక తప్పదు. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకి కూడా అదే జరిగింది. టైటిల్ ఇదే అని రెండు రోజుల ముందే ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

అయితే త్రివిక్రమ్ సినిమాకే ఎందుకిలా జరుగుతుందనేది ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. పెద్ద సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న విషయాన్ని ఎంతో గోప్యంగా ఉంచుతారు మేకర్స్. కానీ త్రివిక్రమ్ సినిమా విషయనికొచ్చే సరికీ అది రివర్స్ అవుతుంది. ఒక వేళ తన టైటిల్ క్లిక్ అవుతుందా..? ఆ హీరో అభిమానులకు నచ్చుతుందా..? లేదా అని త్రివిక్రమే టైటిల్ రివీల్ కి కొన్ని రోజుల ముందు ఇలా లీక్ చేస్తున్నాడా..? అనే సందేహం కూడా ప్రేక్షకులకు కలుగుతుంది. ఏదేమైనా ఎవరూ ఊహించని టైటిల్ పెట్టి ఫ్యాన్స్ ని సప్రయిజ్ చేసే విషయంలో త్రివిక్రమ్ ఎప్పుడు ముందుంటాడు.
Please Read Disclaimer