వాల్మీకిని ఆపిన మెగా స్నేహం

0

నిన్న సాయంత్రం ఉన్నట్టుండి వాల్మీకిని వారం వాయిదా వేసి సెప్టెంబర్ 20కి విడుదల చేస్తున్నామని దీని ద్వారా నాని గ్యాంగ్ లీడర్ కు స్పేస్ ఇచ్చామని దిల్ రాజు సమక్షంలో ఇద్దరు నిర్మాతలు ప్రకటించడం మరీ షాక్ కలిగించలేదు కానీ ఇది ఊహించిన పరిణామమే. కొద్దిరోజుల క్రితం డేట్లు అనౌన్స్ చేసినప్పుడు వాల్మీకి దర్శకుడు హరీష్ శంకర్ క్లాష్ ని సెలబ్రేట్ చేసుకుందామని నాని గ్యాంగ్ లీడర్ పోస్టర్ ప్రత్యేకంగా ట్వీట్ చేసి మరీ విషెస్ చెప్పడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఒకవేళ నిజంగా ఒకే తేదీకి వస్తే ఓపెనింగ్స్ పరంగా ఒకదాని మీద మరొకటి ప్రభావం చూపడం ఖాయమని కామెంట్స్ వినిపించాయి. మొన్నటిదాకా ఎవరూ వెనక్కు తగ్గేలా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు చొరవ తీసుకుని తమ మెగా ఫ్రెండ్ షిప్ ని వాడుకున్నట్టుగా వినికిడి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన బ్యానర్ గా మైత్రితో రామ్ చరణ్ కు మంచి అసోసియేషన్ ఉంది. ఫ్యూచర్ లో వీళ్ళతో ఇంకో సినిమా చేయాలనుంది ఆ మధ్య అన్నాడు కూడా.

ఆ బాండింగ్ తోనే మైత్రి నిర్మాతలు చరణ్ ను సంప్రదించడం తను పర్సనల్ గా చొరవ తీసుకుని తమ్ముడు వరుణ్ తేజ్ కు దర్శకుడు హరీష్ శంకర్ కు నచ్చజెప్పడంతో ఈ వాయిదా సాధ్యపడిందని ఇన్ సైడ్ న్యూస్. హరీష్ శంకర్ చరణ్ చెప్పడానికంటే ముందు బెట్టు చేసినా ఇప్పుడీ పరిణామం తర్వాత తనకూ ఉన్న మెగా స్నేహం కారణంగా ఎస్ చెప్పాడని అంటున్నారు. కారణం ఏదైతేనేం కథ సుఖాంతమయ్యింది. గ్యాంగ్ లీడర్ – వాల్మీకిల క్లాష్ తప్పింది.
Please Read Disclaimer