సుప్రీమ్ కోర్టుకు కాకపోతే చంద్రమండలం వెళ్ళమనండి!

0

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇంటర్వ్యూలు ఇస్తూ విమర్శకులపై సెటైర్లు వేస్తూ మీడియాలో సందడి వాతావరణం కలిగేలా చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో తనదైన స్టైల్ లో పంచ్ లు విసురుతూ అందరినీ ఆకర్షిస్తున్నాడు వర్మ.

‘మీరు రాజకీయ ఉద్దేశాలతోనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం తెరకెక్కించారు కదా? అందుకే ఈ సినిమాను వ్యతిరేకించే వారు మీపై సుప్రీమ్ కోర్టుకు వెళ్తామని అంటున్నారు.. దీనిపై మీ స్పందన ఏమిటి?’ అని అడిగితే తనకు రాజకీయ ఉద్దేశాలు అసలేవీ లేవని క్లారిటీ ఇస్తూ.. ‘సుప్రీమ్ కోర్టుకు కాకపోతే చంద్ర మండలం వెళ్ళమనండి. మనకేంటి ప్రాబ్లెం? వరల్డ్ కోర్టుకు కూడా వెళ్ళమనండి’ అన్నాడు. ఇక కేఏ పాల్ గురించి.. ఆయనకు పాదాభివందనం చేయడం గురించి అడిగితే.. కాళ్ళు లాగే ఉద్దేశంతోనే పట్టుకున్నా ‘రేస్’ పంపిస్తాడని భయపడ్డానని తెలిపాడు. అన్సర్ కంటిన్యూ చేస్తూ ‘హోమో సేపియన్స్ జాతినుండి ఇప్పటివరకూ మనిషిజాతిలో కేఎ పాల్ కన్నా అబద్దాలు చెప్పేవారు ఇంకొకరు పుట్టి ఉండరని నా ప్రగాఢ విశ్వాసం. అంత స్ట్రెయిట్ ఫేస్ తో అలా అబద్దాలు చెప్పడం గ్రేట్. ఆయన కాళ్ళు పట్టుకోవడానికి అది కూడా ఒక ఇన్స్పిరేషన్.’ అన్నాడు. ‘మీరు ఎపీ పాలిటిక్స్ ఫాలో అవుతుంటారా?” అని అడిగితే ‘నాకు కామెడి సినిమాలు చూసేందుకు టైం ఉండదు కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ కోసం కేఎ పాల్ ను ఫాలో అవుతుంటాను. ఆయన వీడియోలు చూస్తే ఆ వెలితి తీరుతుంది’ అంటూ సెటైర్ వేశాడు.

పవన్ కళ్యాణ్..జనసేన గురించి మాట్లాడుతూ ‘పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది’ అంటూ షాక్ ఇచ్చాడు. పవన్ ను చూడాలంటే గతంలో సినిమా పేజి వరకూ వెళ్ళాల్సి వచ్చేదని.. పవన్ కనుక సిఎం అయితే ఆయనను మొదటి పేజిలోనే చూడవచ్చని అన్నాడు. ‘అయన ఒక అందమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోగలరు’ అంటూ మరో పంచ్ పేల్చాడు.
Please Read Disclaimer