ఆ సినిమా రిజెక్ట్ చేసి ‘సరిలేరు’ కి ఓటేసిన విజయ శాంతి

0

కొన్ని సినిమాల్లో పాత్రలు ముందుగా ఒకరి దగ్గరికి వెళ్ళడం ఆ తర్వాత రిజెక్ట్ చేయబడి మరో ఆర్టిస్ట్ చేతి లో పడటం సహజమే. అయితే విజయ శాంతి కూడా సరిలేరు నీకెవ్వరు కంటే ముందు ఓ సినిమా రిజెక్ట్ చేసారట. అదే ‘రాజా ది గ్రేట్’. రవితేజ కంటే ముందు ఆ కథ ను రామ్ కి వినిపించిన అనిల్ రావిపూడి రామ్ తల్లి పాత్ర ను ముందుగా విజయ శాంతి తో చేయించాలని ప్రయత్నించాడట.

అయితే కథ విజయ శాంతి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఇక రామ్ దగ్గరి నుండి కథ రవితేజ కి వెళ్ళడం ఆ తర్వాత విజయ శాంతి రోల్ ను రాధిక చేయడం జరిగిందట. ఇక అప్పటి పరిచయంతోనే మళ్ళీ సరిలేరు లో పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ ని కలిసాడట అనిల్. ఇక కథ చెప్పడానికే మూడు రోజుల పట్టిందని ఆమె ఇంటికి రోజు సోమయాజుల కోసం కమల్ హాసన్ తిరిగినట్లు తిరిగానని చెప్పుకున్నాడు అనిల్ రావిపూడి.

ఎట్టకేలకు తన స్టైల్ లో కామెడీగా కథను నెరేట్ చేసి ఫైనల్ గా ఆ పాత్రకు ఒప్పించాడట. ఇక సినిమా నరేషన్ టైంలో విజయ శాంతి పొట్ట పట్టుకొని మరీ నవ్వుతూ విన్నారని అనిల్ చెప్పుకున్నాడు. సో అలా ‘రాజా ది గ్రేట్’ కి విజయ శాంతి డైరెక్ట్ చేయాలనుకున్న అనిల్ పట్టు వదలని భట్టి విక్రమార్కుడిలా ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా ఫైనల్ గా ఆమెను డైరెక్ట్ చేసేశాడు.
Please Read Disclaimer