హిట్ పడిందిగా వెయిటింగ్ ఎందుకో ?

0

ఏ హీరోకైనా హిట్ అనేదే టార్గెట్. ఒక్క హిట్ వస్తే చాలు వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత మరొకటి సెట్స్ పై పెట్టేసి దూసుకెల్తుంటారు. అయితే ఇందుకు బెల్లం కొండ శ్రీనివాస్ మాత్రం మినహా అనే చెప్పాలి. అల్లుడు శ్రీను తర్వాత వరుసగా ఫ్లాపులు అందుకున్న శ్రీనివాస్ లేటెస్ట్ గా ‘రాక్షసుడు’ అనే రీమేక్ సినిమాతో ఎట్టకేలకు ఓ హిట్ అందుకున్నాడు.

ఆ సినిమా సక్సెస్ ఊపులో దిల్ రాజు చేతిలో తన కొడుకు భాద్యత పెట్టబోతున్నానంటూ చెప్పుకున్నాడు బెల్లంకొండ సురేష్. అంతే కాదు బాలీవుడ్ లో ఓ బడా ప్రొడక్షన్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చిందని త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ ప్రకటిస్తామని అన్నాడు. కట్ చేస్తే ఇంత వరకూ బెల్లం బాబు కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.

మొన్నటి వరకూ సంతోష్ శ్రీనివాస్ తో శ్రీనివాస్ సినిమా అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కొత్తగా శ్రీను వైట్ల పేరు వినబడుతుంది. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు వెయిటింగ్ తప్పదు కానీ ఓ హిట్ వచ్చాక కూడా శ్రీనివాస్ మరీ ఇంతలా వెయిట్ చేయడం అతని కెరీర్ కి ఎఫెక్ట్ అయ్యేలా ఉంది.
Please Read Disclaimer