టీజర్ టాక్: వైఫ్.ఐ

0

‘ఏడు చేపల కథ’ టీజర్.. ట్రైలర్లతో పాపులర్ అయిన హీరో అభిషేక్ రెడ్డి. తెలుగు ప్రేక్షకులను ఎవరైనా అభిషేక్ రెడ్డి ఎవరు అని అడిగితే చెప్పలేరు కానీ టెంప్ట్ రవి అంటే చాలు టక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆ బూతు.. జనాల మనసులోతుల్లోకి వెళ్ళిపోయి పదిలంగా ఉండిపోయింది. తాజాగా అభిషేక్ రెడ్డి ‘వైఫ్.ఐ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.

అరనిముషం మాత్రమే నిడివి ఉన్న ఈ టీజర్లో సినిమా కాన్సెప్ట్ ఏమీ రివీల్ చెయ్యలేదు. భార్య భర్తల మధ్య ఉండే ఘాటు రొమాన్సు చూపించారు.. ఈ బోల్డ్ సీన్లతో పాటుగా హీరో అభిషేక్ ఫ్రస్ట్రేషన్లో ఫోన్లో అరుస్తున్న సీన్లు.. ఎవరితోనో కోపంగా మాట్లాడుతున్న సీన్లు ఉన్నాయి. టీజర్ మొత్తంలో ఒక్క డైలాగ్ కూడా లేదు.. జస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సరిపెట్టారు. ఓవరాల్ గా టీజర్ ను చూస్తే సోసోగానే ఉంది. సినిమాను చూడాలనిపించే ఆసక్తి కలించేలా లేదు.

ఈ సినిమాకు క్యాప్షన్ ‘నైఫ్ బెటర్ దెన్ వైఫ్’. జీఎస్ ఎస్ పీ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఇది. భార్యా భర్తల మధ్య ఉండే గొడవలు.. ప్రేమ.. తదితర అంశాలపై సాగుతుందట. ఈ సినిమాలో అభిషేక్ రెడ్డి సరసన సాక్షి నిదియా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంగీతం వినోద్ యాజమాన్య. ‘వైఫ్.ఐ’ చిత్రాన్ని లక్ష్మి చరిత ఆర్ట్స్.. జిఎస్ఎస్పికె స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆలస్యం ఎందుకు.. ‘వైఫ్.ఐ’ టీజర్ ను చూసేయండి.
Please Read Disclaimer