నాకు అందమైన ఫిగర్ ఉంది చూపిస్తే తప్పేంటి?

0

ఈమద్య అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతున్నాయనే ఉద్దేశ్యంతో చిన్న సినిమాలు ఎక్కువగా అడల్ట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో ఎక్కువ శాతం ప్రేక్షకులను ఆకట్టుకోకుండానే పోతున్నాయి అది వేరే విషయం అనుకోండి. అడల్డ్ కంటెంట్ చిత్రాల వరుసలో రాబోతున్న మరో సినిమా ‘వైఫ్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గుంజన్ మరీ బోల్డ్ గా నటించింది.

వైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా గుంజన్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. అందంగా ఉండి పడుకున్నంత మాత్రాన హీరోలు అవ్వరు.. ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఇండస్ట్రీలో ఛాన్స్ ఉంటుంది. నా ప్రొఫెషన్ నటన. అందుకోసం నేను ఎక్స్ పోజింగ్ కూడా చేయాల్సి వస్తుంది. దానికి నన్ను విమర్శించే హక్కు ఎవరికి లేదు. రోడ్డు మీద కొంత మంది అమ్మాయిలు వెళ్తే అందులో ఒక్కరు స్కర్ట్ వేసుకుని మిగిలిన వారు అంతా కూడా లంగా ఓణీ వేసుకుంటే జనాలు ఎవరిని ఎక్కువగా చూస్తారు. స్కర్ట్ వేసుకున్న అమ్మాయిలనే చూస్తారు. అందుకే జనాలు ఏదైతే కోరుకుంటున్నారో నేను అదే ఎక్స్ పోజింగ్ చేస్తున్నాను.

వైఫ్ సినిమాలో మరీ బోల్డ్ గా నటించారు సిగ్గుగా లేదా అంటూ నన్ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నటించేందుకు నేను ఎప్పుడు సిగ్గు పడలేదు. సిగ్గు పడాల్సిన అవసరం కూడా లేదు. నాకు అందం ఉంది కనుక నా అందమైన ఫిగర్ ను చూపిస్తున్నాను. అందాన్ని చూపించడంలో తప్పు ఏం లేదనేది నా అభిప్రాయం. ప్రైవేట్ పార్ట్ లను చూపిస్తే తప్పు.. నేరం కాని ఏదైతే అందం చూపించాలో అదే తాను చూపిస్తాను అని అందుకు సిగ్గు పడను అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తోంది. వైఫ్ సినిమా తర్వాత వచ్చే ఫీడ్ బ్యాక్ ను బట్టి తాను కొత్త సినిమాల ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకుంటానంది.
Please Read Disclaimer