తమ్ముళ్ల దారిలోనే అల్లు బాబీ కూడా??

0

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే అల్లు అర్జున్ మరియు అల్లు శిరీష్ లు హీరోలుగా ఉన్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో నిలిచాడు. ఇక అల్లు శిరీష్ ఇప్పుడిప్పుడే హీరోగా అడుగులు వేస్తున్నాడు. సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇద్దరు తమ్ముళ్లు నటనలో ఉండగా తానెందుకు నటించొద్దు అనుకున్నాడో ఏమో కాని తాజాగా అల్లు బాబీ కూడా నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న అల్లు బాబీ ఇతర వ్యాపారాలను నిర్వహించేవాడు. ఇప్పుడు అల్లు అరవింద్ బాధ్యతలైన గీతా ఆర్ట్స్ ను టేకోవర్ చేయాలని అల్లు భాబీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. నిర్మాతగా మారే ముందు నటుడిగా తన అదృష్టంను ఒకసారి పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడట. అందుకోసం హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు పరిచయం అవ్వాలని భావిస్తున్నాడట.

నటుడిగా కొనసాగుతూ ఫుల్ టైం నిర్మాతగా మారాలని అల్లు బాబీ భావిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. హీరోలుగా తమ్ముళ్లు కొనసాగుతుంటే బాబీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగే ఉద్దేశ్యంతో బాబీ ఉన్నాడంటూ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ లు హీరోలుగా కొనసాగుతున్న సమయంలో నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు నిర్మాత కూడా రాణించాడు. అలాగే బన్నీ మరియు శిరీష్ లతో పాటు బాబీ కూడా నటనలో రాణించేందుకు ప్రయత్నాలు చేయబోతున్నాడట. బాబీ ఏ చిత్రంతో తెరంగేట్రం చేయబోతున్నాడనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉందేమో చూడాలి.
Please Read Disclaimer