మెగా సపోర్ట్ తో సురవరం గట్టెక్కుతుందా?

0

యువ హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. పలు వాయిదాల తర్వాత విడుదల కానున్న ఈ సినిమాపై కాస్త బజ్ తక్కువే ఉంది. అయితే ఈ సినిమాకు ఈమధ్యే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మెగా సపోర్ట్ తో బజ్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరగనున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమంపై మెగా ఫ్యాన్స్ దృష్టి పడడం ఖాయమే.

దీంతో ‘అర్జున్ సురవరం’ సినిమాకు మంచి ప్రమోషన్ దక్కుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘అర్జున్ సురవరం’ ఒక్కటే కాదు.. మెగా కాంపౌండ్ తో నిఖిల్ బంధం భవిష్యత్తులో కూడా కొనసాగనుందట. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రెండు సినిమాలు చేసేందుకు నిఖిల్ ఇప్పటికే కాంట్రాక్ట్ సైన్ చేశాడని సమాచారం. దీంతో గీతా బ్యానర్ లో నిఖిల్ నటించే సినిమాలకు మెగా హీరోల మద్దతు దక్కుతుందని అనుకోవచ్చు. మరి ఈ సినిమాలకు కూడా మెగా అభిమానుల సపోర్ట్ ఉంటుందా అనేది వేచి చూడాలి. గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ నటించిన సినిమాలకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి అలాంటి మద్దతే నిఖిల్ సినిమాలకు కూడా లభిస్తుందేమో చూడాలి.

‘అర్జున్ సురవరం’ విషయానికి వస్తే తమిళ చిత్రం ‘కనిదన్’ కు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తమిళ ఒరిజినల్ కు దర్శకత్వం వహించిన టీఎన్ సంతోష్ ‘అర్జున్ సురవరం’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ రీమేక్ నిఖిల్ కెరీర్ కు ఎంతమాత్రం ఉపయోగపడుతుందో మనకు మరో మూడు రోజుల్లోనే తెలిసిపోతుంది.
Please Read Disclaimer