బాలయ్య ఆ యువ హీరోతో నటించడానికి ఒప్పుకుంటాడా..?

0

‘అయ్యప్పనుమ్ కోసియుమ్’ మలయాళం లో రీసెంటుగా విడుదలై ఘన విజయం సాధించిన ఒక సినిమా. ఈ సినిమాలో పృథ్వీరాజ్ బిజూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. మన టాలీవుడ్ విషయానికి వస్తే ఈ సినిమా రీమేక్ రైట్స్ హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం. అయితే ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇందులో ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా విక్టరీ వెంకటేష్ – రవితేజలతో రీమేక్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. నిన్న బాలయ్య – ఎన్టీఆర్ కలిసి చేస్తున్నారంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు తాజాగా బాలయ్య – మంచు విష్ణు నటిస్తున్నట్లు మరో వార్త పుట్టుకొచ్చింది. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణని అనుకుంటున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇందులో ఇంకో హీరో పాత్రకు యువ హీరో అవసరం. ఆ పాత్ర కోసం మంచు విష్ణుని అనుకుంటున్నట్టు సమాచారం.

అయ్యప్పన్ క్యారెక్టర్ కు బాలయ్యను కోషియమ్ క్యారెక్టర్ కు విష్ణును తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వాస్తవానికి చంద్రబాబుకి మోహన్ బాబుకి పొలిటికల్ గ్యాప్ ఉంది. ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ టీడీపీపై దండయాత్ర చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. విష్ణు భార్య వెరోనికా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గరి చుట్టం కూడాను. ఈ క్రమంలో బాలయ్య ఈ సినిమా చేస్తాడా?…చేస్తే చంద్రబాబు నాయుడు టీడీపీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారు?.. ఇలాంటి నేపథ్యాల మధ్య బాలయ్య ఇది ఎలా ఒప్పుకుంటాడు. ఖచ్చితంగా విష్ణు అయితే ఒప్పుకోడు అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. మరి మన టాలీవుడ్ లో ఈ పుకార్లకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో. ఈ చిత్రం ఎవరితో తీస్తారనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-