శ్రీముఖికి ఎసరు.. బిగ్ బాసే రక్షిస్తున్నాడా?

0

బిగ్ బాస్ రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం అందరిని దబాయించి పెత్తనం చెలాయించాలని చూసిన హేమను ఇంటి సభ్యులు ప్రేక్షకులు ఇంటికి పంపించారు. బలమైన హేమ తొలివారంలోనే వైదొలగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు రెండో వారంలో సోమవారం నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ చేపట్టారు. అయితే అనూహ్యంగా హేమ తర్వాత యాక్టివ్ గా ఉంటూ అందరితోనూ కలివిడిగా ఉంటున్న ‘శ్రీముఖి’ని బిగ్ బాస్ కంటెస్టెంట్లు అంతా టార్గెట్ చేయడం గమనార్హం.. నిజానికి శ్రీముఖి అందరి గొడవలను పరిష్కరిస్తూ నోట్లో నాలుకలా ఉంటుంది. ఉత్సాహంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అయితే వారికి వీరికి మధ్య శ్రీముఖ చాడీలు చెబుతోందని అనుమానించిన కంటెస్టెంట్లు ఆమెను ఇంటినుంచి పంపించేందుకు నామినేట్ చేశారు. పెత్తనం చెలాయిస్తుందన్న అనుమానాలను బిగ్ బాస్ కంటెస్టెంట్లు చేసి నామినేషన్ లో నిలబెట్టారు.

నిజానికి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చిన సెలెబ్రెటీల్లో హీరో వరుణ్ సందేశ్ ఆయన భార్య హీరోయిన్ వితిక శ్రీముఖి హేమలే కొద్దోగొప్పో పేరున్న సెలెబ్రెటీలు. బిగ్ బాస్ టీం శ్రీముఖిని ఫైనల్ వరకు ఉంచితే రేటింగ్ బాగుంటుందన్న ఆలోచనతోనే ఉన్నట్టు సమాచారం.

అయితే ఇంటిసభ్యులంతా శ్రీముఖిని నామినేట్ చేయడంతో బిగ్ బాస్ టీం వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు అర్థమవుతోంది.. సాధారణంగా ప్రతీవారం అత్యధికమంది నామినేట్ చేసినా తొలి ఆరుగురే నామినేషన్లో ఉంటారు. కానీ ఈసారి శ్రీముఖిని అందరూ నామినేట్ చేయడంతో ఏకంగా 8మందిని నామినేషన్ లో పెట్టారు బిగ్ బాస్. శ్రీముఖి ఎలిమినేట్ కాకుండానే ఇలా ఎక్కువమందిని నామినేట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ఆరుగురికి మించి బిగ్ బాస్ ఎప్పుడూ ఎవరూ నామినేషన్ లోకి రాలేదు.కానీ ఇప్పుడు శ్రీముఖి కోసమే అందరినీ నామినేషన్లోకి లాగారన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. ఆమెను కాపాడేందుకు ఎక్కువమందిని నామినేట్ చేశారంటున్నారు. చూడాలి మరి.. శ్రీముఖిని బిగ్ బాస్ కాపాడుతారా? వచ్చే వారం ఉంటుందా? ఎలిమినేట్ అవుతుందా?
Please Read Disclaimer