మెగా రామాయణం క్యాస్టింగ్ జరుగుతోందా ?

0

ఇంకో రెండేళ్ల తర్వాత విడుదల ప్లాన్ చేసిన అల్లు వారి రామాయణం గురించి అప్పుడే ఫిలిం నగర్ లో రకరకాల కథనాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే రాముడిగా హృతిక్ రోషన్ పేరుని పరిశీలిస్తున్నట్టుగా టాక్ వచ్చింది. ఇప్పుడు సీతగా దీపికా పదుకునేను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో ప్రచారం మొదలైంది. పదిహేను వందల కోట్ల దాకా బడ్జెట్ తో ఇప్పటిదాకా ఎవరు తీయని రేంజ్ లో త్రీడిలో ఇది రూపొందించబోతున్నట్టు అరవింద్ గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

అందరూ నార్త్ స్టార్స్ ఉంటే మనవాళ్లకు కనెక్ట్ అవ్వదు కాబట్టి ఇక్కడి తారలు కూడా ఉండేలా క్యాస్టింగ్ జరుగుతోందని వినికిడి. రావణాసురుడిగా విక్రమ్ ని దశరధుడిగా ప్రకాష్ రాజ్ ని లక్ష్మణుడిగా విజయ్ దేవరకొండని హనుమంతునిగా కిచ్చ సుదీప్ సెట్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయట. కానీ ఇవన్నీ ప్రస్తుతం ప్రతిపాదన స్టేజిలో ఉన్నవి. ఎంచుకోవాలనుకున్న వారందరూ డిమాండ్ ఉన్న స్టార్స్ కాబట్టి కాంబినేషన్ సెట్ చేయడం అంత ఈజీ కాదు.

తమ పాత్రలకు ఎంత వెయిటేజ్ ఉందని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కానీ ఓకే చెప్పలేని పరిస్థితి. ఇదంతా తేలడానికి చాలా టైం పడుతుంది. 2021 రిలీజ్ అనుకున్నా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది.పేపర్ మీదే ఇంత భారీగా కనిపిస్తున్న ప్రాజెక్ట్ తెరపైకి వెళ్ళాక ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ ఎన్నో వస్తాయి. అందుకే ఇప్పటినుంచే దానికి అనుగుణంగా ప్లానింగ్ ఉండాల్సిందే. షూటింగ్ మొదలుపెట్టే దాకా ఇలాంటి భారీ సినిమాల గురించి ఏదీ నిర్ధారణకు రాలేం కాబట్టి అప్పటిదాకా వేచి చూడటం తప్ప ఎవరైనా ఏమి చేయలేరుగా.
Please Read Disclaimer