చిరు స్మార్ట్ శంకర్ ని చూస్తారా ?

0

ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ అండ్ ఓన్లీ మాస్ మసాలా సినిమాగా వీర విహారం చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. వీక్ డేస్ కాబట్టి కొంత స్లో అయినా ఇప్పటికే బయ్యర్లు ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి హిట్ స్టేటస్ ఎప్పుడో వచ్చేసింది. ఇలాంటి సినిమాలు ఏది వచ్చినా ఎప్పుడు వచ్చినా ప్రోత్సహించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి ఇస్మార్ట్ శంకర్ చూస్తానని పూరికి కబురు పెట్టారట.

మెగాస్టార్ అడిగితే కాదనేదెవరు. ఆఘమేఘాల మీద దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. నిజంగా చిరు అడిగారా లేక జస్ట్ ఆసక్తి చూపించారా అనే క్లారిటీ లేదు కానీ గతంలో ఇలా చూసిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సక్సెస్ టూర్ లో ఉన్న పూరి హైదరాబాద్ వచ్చేశారా లేక వచ్చాక ఈ షో ఉంటుందా అనే వివరం కుడా తెలియాల్సి ఉంది

ఇప్పుడీ వార్త నిజమే అయితే ఇస్మార్ట్ శంకర్ కు ఇంకాస్త మైలేజ్ వస్తుంది. ఇప్పటిదాకా చూడని మెగా ఫ్యాన్స్ ఓ లుక్ వేయొచ్చు. అలా మద్దతు దక్కినా ఫిగర్స్ కు అదనంగా నెంబర్లు తోడవుతాయి. అసలే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచి వాటిని విపరీతంగా ఇష్టపడే చిరంజీవి ఇస్మార్ట్ శంకర్ చూడటంలో ఆశ్చర్యం లేదు కానీ గతంలో ఆటో జానీ అనే స్క్రిప్ట్ చిరుకి వినిపించినప్పుడు సెకండ్ హాఫ్ నచ్చలేదన్న కారణంగా అది సెట్స్ పైకి వెళ్లలేకపోవడం అందరికీ గుర్తే. ఒకవేళ ఇప్పు డు ఇస్మార్ట్ శంకర్ కనక నచ్చితే చిరుకి మళ్ళీ ఏమైనా సాఫ్ట్ కార్నర్ వస్తుందా చూద్దాం
Please Read Disclaimer