హిరణ్యకసిపుడితో జత కడుతోందా?

0

దగ్గుబాటి రానాకు తెలుగు పరిశ్రమను మించి బాలీవుడ్ లో కాంటాక్ట్స్ ఉన్నాయి. తొలి నుంచి టాలీవుడ్- బాలీవుడ్ లో సినిమాలు చేయడం అతడికి పెద్ద ప్లస్ అనడంలో సందేహం లేదు. బాహుబలి ఫ్రాంఛైజీతో రానా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అక్షయ్ తో కలిసి బేబి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలోనూ నటించాడు. ఆర్జీవీ పుణ్యమా అని డిపార్ట్ మెంట్ లాంటి డిజాస్టర్ చిత్రంలోనూ నటించాడు. మంచి చెడు రెండూ అతడికి ఆరంభమే పాఠాలయ్యాయి. అందుకే ఇప్పుడు తెలివిగా పాన్ ఇండియా కేటగిరీ చిత్రాల్ని ఎంపిక చేసుకుని నటిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా చిన్నపాటి బ్రేక్ వచ్చినా తిరిగి అతడు తన మ్యాకో రూపానికి మారేందుకు ప్రణాళికల్లో ఉన్నాడు.

భవిష్యత్ లో అతడి నుంచి రాబోతున్న సినిమాలన్నీ భారీ కాన్వాసుతో వస్తున్నవే. `హాథీ మేరా సాథీ` చిత్రం ఇటు తెలుగు-తమిళం.. అటు హిందీలోనూ రిలీజ్ కానుంది. వెంకీ కుడుములతో విరాఠపర్వం పూర్తి చేయాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా కేటగిరీలో తెరకెక్కుతున్న భారీ చిత్రం హిరణ్యకసిప ఇంకా డైలమాలోనే ఉంది. గుణశేఖర్ ఓవైపు గ్రాఫిక్స్ -వీఎఫ్ ఎక్స్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారని సురేష్ బాబు తెలిపారు. స్క్రిప్టు- కథ విషయంలో భారీగా పనులు నడుస్తున్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి.. సొంత స్టూడియోలోనే కాకుండా లండన్ లోనూ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఎప్పుడు వస్తుందా? అన్న ఉత్కంఠకు తెర వీడలేదు.

రానా నటించే పాన్ ఇండియా సినిమా `హిరణ్యకసిప`లో బాలీవుడ్ స్టార్లకు ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. భళ్లాలదేవ బ్రాండ్ తో ఈ సినిమాని అక్కడా భారీగా రిలీజ్ చేస్తారు కాబట్టి అందుకు తగ్గ ప్రణాళిక దగ్గుబాటి కాంపౌండ్ లో ఉంది. తాజాగా జియో -మామి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న రానా అక్కడ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ జంట చూడముచ్చటగా కనిపించింది. ఒడ్డు పొడుగులో ఇద్దరూ ఇద్దరే. అందుకే ఇలాంటి జోడీ కలిసి నటిస్తే పాన్ ఇండియా అప్పియరెన్స్ కనిపిస్తుందనడంలో సందేహం లేదు. మరి అందుకు డిప్స్ ఒప్పుకుంటుందా? అన్నది చూడాలి. దీపిక ప్రస్తుతం హబ్బీ రణవీర్ సింగ్ తో కలిసి కపిల్ బయోపిక్ 83లో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాసిడ్ ఎటాక్స్ బాధితురాలి బయోపిక్ లోనూ దీపిక నటిస్తోంది.
Please Read Disclaimer