చిరు …బన్నీ ఆదేశించారు సరే పట్టించుకుంటారా ?

0

రెండు రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఆయనకీ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందించాలని కోరాడు. అంతే కాదు కృష్ణ గారికి ఆ అవార్డు ఎట్టి పరిస్థితుల్లో వచ్చేలా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశించాడు.

అయితే నిన్న జరిగిన ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ లో కూడా బన్నీ తన తండ్రికి సరైన గౌరవం లభించలేదని ప్రభుత్వాలు వెంటనే ఆయనకీ పద్మశ్రీ అవార్డు అందించి స్టార్ నిర్మాతగా ఓ గౌరవం ఇవ్వాలని కోరాడు. ఇంత వరకూ బాగానే ఉంది. మొన్న చిరు దాదా సాహెబ్ అన్నాడు కాబట్టి బన్నీకి సడన్ గా తండ్రికి రావాల్సిన అవార్డు గుర్తొచ్చిందా లేదా బన్నీ మనసులో ఎప్పటి నుండో ఉన్న కోరికను నిన్న సందర్భం కనుక చెప్పేశాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇద్దరూ ఇద్దరు పెద్ద మనుషులకు రెండు అవార్డులు అందివ్వాలని కోరారు బాగానే ఉంది కానీ ఈ స్టార్స్ మాట ప్రభుత్వాలు పట్టించుకుంటాయా ? చూడాలి. ఇక సరిలేరు నీకెవ్వరు అల వైకుంఠ పురములో రెండు సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి. దర్బార్ ఎంత మంచివాడవురా కూడా పోటీ లో ఉన్నాయి.
Please Read Disclaimer