ఆ నిర్మాణ సంస్థల విజయాలకు బ్రేక్ పడనుందా..?

0

ప్రస్తుతం టాలీవుడ్ లో లాభాల్లో దూసుకుపోతున్న నిర్మాణ సంస్థల్లో ఫస్ట్ పొజిషన్ లో ఉండే ప్రొడక్షన్ హౌసెస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు హీరోలతో సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాయి. చిన్నబాబుగా పిలవబడే ఎస్. రాధాకృష్ణ ఈ నిర్మాణ సంస్థలకు అధినేత. ‘ఆత్మకథ’ సినిమాతో చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టిన చిన్నబాబు కొన్ని ఏళ్ళ గ్యాప్ తీసుకొని కంబ్యాక్ మూవీ జులాయి లో భాగస్వామి అయ్యాడు. ఈ చిత్ర విజయంతో వెనుదిరిగి చూసుకోకుండా ‘అ ఆ’ అరవిందసమేత ప్రేమమ్ జెర్సీ లాంటి మంచి చిత్రాలను నిర్మించి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. ఈ ఏడాది వారి నిర్మాణంలో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ ‘భీష్మ’ చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే తమ తదుపరి సినిమాలు పరాజయం పాలయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థలు ప్రస్తుతం ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా నితిన్ – వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ‘రంగ్ దే ‘ సినిమా నిర్మిస్తున్నారు. నాగశౌర్యతో ఒక మూవీ చర్చల దశలో ఉంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాను పక్కన పెడితే మిగతా రెండు సినిమాల విషయంలో సినీ అభిమానులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

దీనికి కారణం లేకపోలేదు వెంకీ అట్లూరి తీసిన చిత్రాలను పరిశీలిస్తే తన ఫస్ట్ సినిమా ‘తొలిప్రేమ’కి రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’కి చాలా దగ్గర పోలికలుంటాయి. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న ‘రంజీబ్ దే’ మూవీ కూడా అలానే ఉండబోతోందనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో స్టార్ట్ అయింది. ఇంక ఈ చిత్ర విజయం నితిన్ మీదే ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆ తర్వాత రాబోతున్న నాగశౌర్య మూవీ..హీరో ప్రస్తుత పొజిషన్ బట్టి చూస్తే ఓపెనింగ్స్ కష్టమే అని చెప్పుకోవాలి. ఏదేమైనా వరుస హిట్లతో విజయపథంలో దూసుకు పోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ లకు ఈ చిత్రాలు బ్రేక్ వేస్తాయో లేదా ట్రాక్ రికార్డును కంటిన్యూ చేస్తాయో చూడాలి మరి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-