వల్గారిటీ లేదంటూ సమర్ధించుకుంటోందా?

0

సెన్సేషనలిజమ్ ఆర్జీవీ-పూరి లాంటి డైరెక్టర్ల బ్లడ్ లోనే ఇమిడిపోయి ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్టు కొట్టడమే ధ్యేయంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `ఐస్మార్ట్ శంకర్` అంటూ సెన్సేషన్స్ కి ప్లాన్ చేసారు. ఎనర్జిటిక్ రామ్ ని ఊర మాస్ అవతారంలో చూపిస్తున్నారు. నైజాం యాస.. రగ్గ్ డ్ లుక్ తో రామ్ ఈ చిత్రంలో అభిమానులకు కొత్తగా కనిపించనున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ మాస్ కి పెద్ద ధమ్కీ అంటూ యూత్ లో ముచ్చట సాగుతోంది. అయితే ఈ ట్రైటర్ మరో కొత్త వివాదాన్ని మోసుకొచ్చింది.

ఇస్మార్ట్ టీజర్ చూసిన మహిళామణులంతా పూరి అండ్ టీమ్ పై రుసరుసలాడుతున్నారు. ముఖ్యగా నభా నటేష్ – నిధి అగర్వాల్ ఒకరితో ఒకరు పోటీపడుతూ అందాల ఆరబోసేందుకు ఏమాత్రం వెనకాడకపోవడంతో .. మరీ వల్గర్ గా కనిపిస్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా టీజర్ లో నభా నటేష్ టూమచ్ అన్న విమర్శలు వచ్చాయి. “సర్ సర్ వీడు ఇక్కడో శాడిస్టు గాడు నన్ను ఖరాబ్ చేస్తున్నాడు!“ అంటూ నభా చెప్పిన డైలాగ్ వినేందుకే వల్గర్ అన్న విమర్శలు వినిపించాయి. ఇస్మార్ట్ శంకర్ ఊర మాస్ వేషాలపైనా మహిళా మండళ్లు ప్రస్తుతం సీరియస్ గానే ఉన్నాయట. ఒక్క ట్రైలర్ తోనే ఇంతగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే తనపైనా ఇస్మార్ట్ శంకర్ పైనా వస్తున్న విమర్శలకు నభానటేష్ ధీటైన సమాధానమే ఇచ్చింది.

అసలు ఇందులో వల్గారిటీ ఏం ఉందిలే! అంటూ క్లాస్ తీస్కుంది నభా. “ఆడాళ్లను కించపరిచేలా లేదా అవమానపరిచేలా అసలు ఇస్మార్ట్ శంకర్ లో ఏ సన్నివేశం ఉండదు. కేవలం రొమాన్స్ మాత్రం కాస్త ఘాటుగానే ఉంటుంది. హీరో అమ్మాయిల వెంట పడడం అన్నది అసలు కథతో సంబంధం లేకుండా ఏం ఉండదు. నా పాత్ర శంకర్ ని టీజ్ చేస్తుంటుంది. ఫెడీల్మని చెంపదెబ్బలు కొడుతుంది. ధమ్కీస్ ఇస్తుంటుంది“ అంటూ లాజికల్ గా మాట్లాడింది నభా. కేవలం పెద్ద తెరపై చెలరేగిపోవడమే కాదు మాటల్లోనూ ఈ అమ్మడు ధమ్కీ తినిపించేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ 2 లో నిధి అగర్వాల్ ని మించి రెచ్చిపోతున్న నభా.. హీరో కంటే మాస్ గా కనిపిస్తోంది. రామ్ ని ఎడా పెడా కొట్టేయడం.. ఘాటైన రొమాన్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
Please Read Disclaimer