పెళ్లి తర్వాతా మెగా ప్రిన్సెస్ నటిస్తుందా?

0

పెళ్లి తర్వాతా మెగా ప్రిన్సెస్ నీహారిక నటిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. అక్కినేని కోడలు సమంత తరహాలోనే నీహారక ప్లానింగ్స్ ఎక్స్ క్లూజివ్ గా ఉంటాయట. అందుకు మెగా ప్లానింగ్స్ ప్రీప్లాన్ ఉందని గుసగుసలు ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అసలు పెళ్లికి కెరీర్ కి ముడి పెట్టి చూడడం సరైన విధానం కాదన్నది మెగా థింకింగ్. నీహారికకు ఇప్పటికే వెబ్ సిరీస్ నిర్మాణంలో అనుభవం ఉంది. అందువల్ల మునుముందు నిర్మాతగానూ మారే వీలుందని భావిస్తున్నారు.ఇక పెళ్లి తర్వాతా నటించేందుకు నీహారిక ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే తెలుస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాతగా మారి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సూర్య కాంతం ఫేం ప్రణీత్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు సాగుతున్నాయట. హరీష్- మహేష్.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ఈ వార్తను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.నీహారిక నటించిన `సూర్యకాంతం` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా నటిగా మంచి మార్కులే వేశారు. దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించారు. అందుకే ఇప్పుడు ప్రణీత్ కి నీహారిక మరో ఆఫర్ ఇచ్చారట. టోకెన్ అడ్వాన్స్ కూడా అందుకున్నాడని సమాచారం. ప్రతిదీ అనుకున్నట్లు జరిగితే ఈ కాంబినేషన్ మూవీ అక్టోబర్ లో ప్రారంభమవుతుందని తెలిసింది.

గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ కుమారుడు చైతన్యను నీహారిక పెళ్లాడనున్న సంగతి తెలిసిందే. 2021 లో ఈ వివాహం జరగనుంది. ఆ క్రమంలోనే పెళ్లి తర్వాత నీహారిక కెరీర్ సంగతేమిటా అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.




Please Read Disclaimer